పుట:2015.372978.Andhra-Kavithva.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

భావప్రకటనము.

247


విషయమున సంపూర్ణైక్యభావ ముండుట యబద్ధమనియు, బదముల ప్రత్యేకార్థములను గ్రహింపకుండ వానిని వాడుట రసాభాసత్వ హేతువనియుఁ జెప్పియుంటిమి. కావున నిప్పుడు ప్రత్యేకించి తెల్పెడి దేమనఁగా నేమాట యర్ల మామాట కెట్లు సిద్ధమును రూఢియో యభై యేభావముయొక్క పద జాల మాభాపమునకు రూఢిగనే యుండును. అట్టి రూఢ్యర్థ ములను రూఢిపదజాలములను వదలి పై పై మెఱుఁగుల కాస పడి పర్యాయపదము లను వేరిట పదముల విచ్చలవిడిగఁ బ్రయో గించుట పొసఁగని పద్దతీయని సూచించును. కావున భావము యొక్క స్వరూపమును దర్శించి యనుభవింప నియట్టివాడు దానినిఁ బదముల వర్ణింపఁజాలఁడు, భోపము యొక్క ప్రత్యేక స్వరూపమును గుర్తెఱుంగక యిచ్చవచ్చి నట్లు పదజాలంబు నుపయోగించిన స్ఫుటమును, రుచిరమును, రూఢియైనవియు నగు నర్థముఁగాని భావస్వరూపముఁగాని సిద్ధింపక యేమియుఁ డెలియని బాలురు పిచ్చిగీతల గీయ వానివలన నెట్టి పరిస్ఫుట సుందరాకృతులు వెలువడునో యట్టి విలక్షణ శూన్యములగు నాకృతులే వెలువడఁగలవు.

ఏభావమున కాశై లియే. ఒకభావముయొక్క శైలి మార్చి వేటీక శైలినివర్ణించుట. రెండు లోపములను జేయుట. అని యేవన. ఒకటి భావములును శైలి (అనఁగఁ బదజాలము) యును సేకపస్తువుగాక రెండు భిన్న వస్తువులని భ్రమించి, , భాపములకును భాషకునుఁ గల యభేదమును గ్రహింపక పోవుట; రెండు వస్తువునకుఁ గల ప్రత్యేకస్వరూపముఁబోలి