పుట:2015.372978.Andhra-Kavithva.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

భావ ప్రకటనము.

245


ముననే రూఢిగ వాడఁబడు చున్నది. "ఉహూహూ" యని చలిచే వడఁకునప్పుడే యందుముగాని, యెండ వేడిమిచేఁ దపించు చున్నపు డందుమా? 'అహహా' యని యాశ్చర్యము కలిగిన వేళ లనే, గొంచెముహాయి జనించిన వేళలనే యనుకొందుముగాని, యితర సమయముల ననుకొందుమా! కర కర, గజగజ యను ననుకరణములను గఱకుతనము సూచించుటకే పొడుదుము గాని మార్దవము సూచించుపట్ల పొడుదుమా? వెన్నను,మంచి నీళ్లను, పొలను కఱకఱ-గఱగఱ నమలువారుగాని, నమలుదురని చెప్పువారుగాని లేరుగదా! కావున సనుకరణములకు స్వభావమును మానవవ్యవహారమును ననుసరించి రూఢియగు సంజ్ఞార్థము గలదని యెఱుంగునది. అందువలనఁ బ్రతిమాటయు సర్జము జూలుననియుఁ, బ్రత్యర్థమును మాటలకు వశమై యుండుననియు, సర్గమును దత్సంజ్ఞారూపళమగు పదమును, తొయియును దత్స్వరూపమునుంబలే నేకవ్యక్తి గలవై యవినాభావసంబంధముతో వర్తించుచుండును. ఈరహస్యము శై లీవిషయమున నవశ్య గ్రహణీయము. ఎట్లనఁగాఁ బ్రతిమా టయు నొక్కొక్క యర్థము నీజాలినపుడు ఒక్క మాటను మార్చి వేఱొకమాటను వాడినచో నర్థము వేరగుట దప్పదు.

పర్యాయసమానార్థకపదముల విషయము. -

-

ఈసందర్భమును మన దేశములోని భాషా సాంప్రదాయ మును బండిత సమయములును నొక్కింత యాక్షేపింప నవసర మొదవు చున్నది. మన దేశమున సమానార్థకము లను పేరఁ జాల పదముల నడ్డు దిడ్డముగ నుపయోగించుట యాచార మగు చున్నది. దానికి గారణము మనవారు విషయపరిజ్ఞాన మల