పుట:2015.372978.Andhra-Kavithva.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర కవిత్వచరిత్రము

పంచము.


కాళిదాసకృత శకుంతలావర్ణనము,-

ఇట్టి యత్యద్భుతపుశక్తి కాళిదాసును భవభూతియుఁ. దిక్కనయు నచ్చటచ్చటఁ బ్రదర్శించిరి. చూడుఁడు!

సౌందర్య రాశియు, కిమివహి మధురాణాం మండనం సొకృతీనామ్' అను వచనమునకు లక్ష్యమయినట్టియు, సహజలావణ్యవతి యునగు శకుంతలను గాంచిన తోడనే దుష్యంతమహా రాజు. 'అయే! లబ్దం నేత్ర నిర్వాణమ్' అనుపలుకుల నా పెయెడ దనకుఁ గల యభిలాషము, నభిమానము, నాశ్చర్యమును,. సంతోషమును, నొక్క మాఱుగ ధ్వనించునట్లు మాట్లాడినారు. అన్యకవు లన్న నో కాళిదాసునివ లెఁగాక లేనిపోని యుత్ప్రే క్ష సహితమగు విపరీతభావముల నేవో మన నెత్తిన కొట్టి యుండెడివారే! 'త్వమేవాహం త్వమేవాహం త్వమేవాహం నసంశయః' అను వాగ్గేవ్యసునయమునకుఁ బాత్రుఁడైన కాళి దాస మహాకవి సామాన్యకవులఁబోలె విపరీతాలంకారములతో దుష్యంతుని భావమును వర్ణింపక తాత్కాలికము గదుష్యంతుని యాత్ర చే నావహింపఁబడినవాఁడై దుష్యంతుని హృదయాంత రాళమున ధ్వనించుచుండిన పల్కులను పట్టి సందర్భమునఁ దాను వర్ణించెను. 'అయే' యను మాటవలన దుష్యంతుని స్తంభితునిఁ జేసిన యాశ్చర్వ భౌషమును, 'అబ్దం' అనుమాటవలన నతఁడు పొందిన మనస్సంతోషమును 'నేత్ర నిర్వాణమ్' .అనుమాట వలన శకుంతల యొక్క యలౌకి కాద్భుతలావణ్యమును, దద్ద హణమును నొక్కమాటుగ ధ్వనించుచున్నది. ధ్వనిసిద్ధియన్న నిట్లుకదా యుండవలయును?