పుట:2015.372978.Andhra-Kavithva.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

భావములు భావనాశక్తి,

235


భారతమునుండి యొకయుదాహరణము.

చూడుఁడు. భారతమున దుర్యోధనుఁడు భీమునిచేఁ దొడలు విఱుగఁగొట్టఁబడినవాఁడై యశ్వత్థామ యుపపొండ వులను, ధృష్టద్యుమ్నుని, శిఖండిని వేయేల? పంచపాండువు లును, గృష్ణుఁడును, సాత్యకీయును, ద్రౌపదియుం దక్క పాండవసైన్యమును సర్వమును నాశముఁ గొవించివచ్చిన పార యతని నోటనే వినినవాడై ప్రాణంబులు విడుచుటకు బూర్వము “అమువ్వుర మొగంబులఁగలయంగనుంగొని మీరు శృతకృత్యులరు. సుఖుల రై యుండుఁడు. పునర్దర్శనంబు త్రిది పంబున నయ్యెడుంగాక. పగలు మాని పొండనిషలికి ప్రాణం. బులు విడిచిన వార లవ్వసుమతీ పతిఁ గౌఁగిలించుకొని వలగొని వచ్చి మరలి చూచుచు నరదంబు లెక్కి యరిగిరి." ఈ వాక్యము నందలి 'మీరు కృతకృత్యులరు. సుఖుల రై యుండుఁడు' అను మాటలలో గస్పట్టు నార్తి యనుభవైకవేద్యము. 'పునర్దర్శ వంబు త్రిదివంబున నయ్యెడుంగాక' యనుమాటలవలన దుర్యో ధనునకును, దిక్కనకును ఏకసమయమునం దే స్వర్గము కన్ను ల గట్టినట్లు మనకును దోఁచుచునేయున్నది. 'మరలి చూచుచు' అనునూటవలన నశ్వత్థామాదుల మూర్తులును వారియొక్క విచారమును, నొక్క పెట్టున మనల నావహించుచుండును. ఆహా! దుర్యోధన నిర్యాణరంగము తిక్కన కనులయెదుటఁ గట్టి యుండనిచో నాతఁ డిట్లు వ్రాయఁగల్గియుండునా? భారతమున నిట్టిపట్లు ఎన్నేనియుంగలవు! వాని నన్నింటిని సుదాహరింప బూనుట గ్రంథవి స్తరభీతి చే మానుకొంటిని.