పుట:2015.372978.Andhra-Kavithva.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

భావములు భావనాశక్తి.

238


స్కాట్లండు దేశపు రాజును భార్యయొక్క దుర్బోధము వలనను తాను రాజు కాగలఁడని చెప్పిన మంత్రకత్తెల మాటల నమ్మిద్రోహచిత్తుఁడై తన మందిరమున అతిథిగ రావించి యర్ధరాత్రమున సుఖసుప్తుడై యున్న వానిని జంపనేఁగి ధైర్యముసొలక మరలివచ్చెను. తోడనే మహాశ క్తి స్వరూపిణి యనఁదగు నతని భార్య యతనినిఁ దూలనాడి యతని పిరికితనము సపహసించి యతని కరముల నున్న ఖడ్గమును దాను గయికొని నిద్రారతిం జొక్కియున్న 'రాజును జంపనేఁగేను. ఏఁగి యేకారణముననో యాతనిఁ జంపక మరలివచ్చి భర్తతో నీ క్రిందిమాటలఁ దాను రాజును జంపకుండుటకుం గల కారణమును నివేదిం చెను.

For, had be n0t looked like my father, I bad done the deed.

(అతఁడు నాతండ్రియాకృతిని గన్పట్టకుండినచో నాతనిని దప్పక చంపియుండెడిదాననే..) ఈపలుకులు కవియొక్క దివ్య ప్రతిభను ననితరసొమాన్య కవితాశక్తిని సూచించునని కొందఱు అభిప్రాయపడిరి. కాని వాట్ స్టంట అనుపండితుఁడు అయ్యది పై యుదాహరణములఁ బ్రదర్శితమయిన యత్యద్భుతభావనాశక్తిని బ్రదర్శించుట లేద నియు, నంతకన్నఁ గొంచెముతక్కు వరకపు భావనాశ క్తినే ప్రద ర్శించుననియు, దానికిఁ దార్కాణముగ నిట్టిసందర్భమే ఒక 'యరబ్బీకథ యందు వర్ణితమయినదనియుఁ, గావున నియ్యది యని తరకవిదుర్లభమగు నంత తీక్షమగు భావనాశ క్తిని బ్రదర్శించుట లేదనియు విమర్శించెను.