పుట:2015.372978.Andhra-Kavithva.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

226

ఆంధ్ర కవిత్వచరిత్రము

పంచమ


తాను వర్ణింపఁదలఁచిన విషయములను దివ్యశక్తి చేత స్పుటముగఁ గాంచి, యనుభవించి వర్ణించును. అట్టిదివ్యశక్తి కవికి జన్మతా లభ్యమౌనని యిప్పటి కేవిన్నవించి యుంటిని. అట్టి దివ్య శక్తి మున్ను భారతయుధ్ధప్రకారమును ధృతరాష్ట్రుని కెరింగించుటకై యుద్ధరంగమున సర్వత్ర జరగుచున్న విషయముల కన్ను లార గాంచి వర్ణింపుమని సంజయునకు వేదవ్యాసుఁ డొసంగిన దివ్యదృష్టి వంటిది. పుట్టుగుడ్డియైన ధృతరాష్ట్రునకు శ్రీకృష్ణుడు తనవిశ్వరూపము దర్శించుటకై యొసఁగిన దివ్య దృష్టివంటిది. అట్టిదివ్యదృష్టి బలమున నే రవి గాంచ లేని వాని నెల్లఁ గాంచఁగలుగుట, అట్టిదివ్యదృష్టి బలమున నే సామాన్య కవులు 'గాంచ లేని విషయముల నీస్వతంత్ర భావనాశ క్తిగల కవి వర్ణింపఁగలుగుట. అట్టి స్వతంత్ర భావనాశ క్తిని నాటకరచనా శక్తి యనియు, దివ్యదృష్టియనియు గ్రహింపఁదగును. ఇట్టిశక్తి నాటకముల యందును కథాభాగము విశేషముగాగల పురాణము లాదిగాగల మహాకావ్యములయందును నప్పుడప్పుడు ప్రదర్శితమగుచున్నది. అది యొక తపస్సిద్ది వంటిదని చెప్పుటచే నయ్యది సర్వదా యనుభూతము కాదనియుఁ, దపస్సు సిద్దించిన వేళల మాత్ర మే లబ్దమగుననియు గ్రహించునది. కవి కట్టి దివ్య దృష్టి 'మెఱుఁగు మెరసి య ట్లెప్పుడో లభ్యమై యితర సమయముల మాయమైపోవుచుండును. మఱియు నాటకకర్తకుల గూడ నీపరకాయప్రవేశము సర్వదా సాధ్యముకాదు. అతఁ డేదో యొక ప్రాతమందే లీనమైన మనస్సుగలవాఁడగును.అట్టి పొత్రము యొక్క స్వభావమందైనను నెప్పుడోయొకప్పుడు లీనుఁడై స్వశక్తి నశించినవాఁ డగునుగాని మిగిలిన వేళలను స్వభావము మీరి చరింపజూలక తనయూహాప్రకారమే పాత్రముయొక్క