పుట:2015.372978.Andhra-Kavithva.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము,

భావములు భావనాశక్తి.

225


విధములుగ నుండునని సూచించినాఁడు. Absolute Inagination అనఁగా సర్వస్వతంత్రమగుభాపనాశక్తి, Relatiya Inagination అనఁగాఁ గవియొక్క చిత్తవృత్తి ననుసరించుచు కవియొక్క స్వభావము చే పరిమితమగు భావనాళక్తి. సర్వస్వతంత్ర భావనా శక్తి, యఖండశక్తియుత మైనది. దాని నేనియమములును బాధింపనేరవు. భావసామ్రాజ్యమున దానికి సర్వస్వతంత్రాధి కారము కలదు. అట్టి భావనాశక్తి కవియొక్క స్వభావము చేత గూడఁ గట్టుపడియుండదు. అట్టిభావనాశక్తి తఱచుగ నాటక ములయందే ప్రదర్శిత మగుచుండును. అట్టి భావనాశక్తి నిజముగఁ బరకాయ ప్రవేశ విద్యవంటిది. తత్ప్రభావము చేఁ గవి. తాను వర్ణింపఁదలఁచి కొనిన పాత్రమునందు లీనుఁడై పోవును. అట్లు లీనుఁడై పోయినకవి యాపాత్రమునఁ దనయొక్క భావ మున కనుగుణముగఁగొని తన చిత్తవృత్తి కనుకూలముగఁగాని, తన యూహానుసారముగఁగాని వర్ణింపఁజూడఁడు. మఱి యాపాత్రము యొక్క స్వభావ మెట్లు నడచునో యట్లే వర్ణించును. ఆపొత్రముయొక్క మూర్తిని సొత్తు కన్నులదర్శించి యా పాత్ర ముయొక్క చేష్టాదికములను, సంభాషణమును తాను గాంచినట్లే తాను విన్న యట్లే వర్ణించును. ఆపొత్రము వర్ణించు నపుడు కవి తన వ్యక్తిని, స్వభావమును సంపూర్ణముగ వదలినవాఁడై , పాత్రమునందు లీనుఁడై , పాత్రహృదయ: గహ్వరాంతరమునఁ బ్రవేశించి, తానే పాత్రమై పాత్రము, పల్కించు పలుకుల నే పలుకుచుఁ, జేయు చేష్టలనే వర్ణించి ప్రదర్శించును. అట్టిశ క్తిగల కవి సిద్ధునివంటివాఁడు. యోగ. బలమున సిద్ధుఁడు దేవతాస్వరూపముల నెట్లు గాంచి యను భవించునో యట్లే స్వతంత్ర భావనాశ క్తిఁగల కవి కూడ

ఆంధ్ర కవిత్వ-15