పుట:2015.372978.Andhra-Kavithva.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

భావములు భావనాశక్తి,

227


స్వభావమును వర్ణించుచుండును. ఇట్టి నాటకరచనాశక్తి ఎచ్చటనో కొన్ని రంగములనే ప్రదర్శితమగుచుండును. అట్టి నాటకపుఁబట్టులయందుఁ గవి యనవసర వాగ్వ్యయముఁ గావింపక పొల్లుమాటయైనఁగాని, పొల్లుఅక్షరమైనఁగాని రానీయక యథాశ్రుతమును, యథాదృష్టమునునగు పలుకులను రీతులను వర్ణించును. సాధారణకవు లెల్లరును భావనాబలమున నిట్లుండు నని యూహించి యాప్రకారము వర్ణింతురు. వారికి దివ్యదృష్టి యంతగా లేని కారణమున నూహాపరిమితములును నూహా చింతితములును నగు పలుకులును మూర్తులును ననుభవైక వేద్యము లగు చుండును,దివ్యదృష్టిగల కవుల పలుకు లట్టి దివ్య దృష్టి ప్రదర్శితమగు పట్టుల ననితరతుల్యములును,ననితర సామా న్వములును, కేవలో పగ్నాసూచకములును నై యాశ్చర్యముఁ గొలుపుచు "ఔరా, ఈకవి దక్క నన్యు లెవరైన నీవర్లనం జేయఁగల రే! యీభావముల వ్రాయఁగల రే! ఈ భావ మితని సొమ్మేకాని యితరులది కాదు ఈభావము రచించినవాఁ డితఁడే గాని ఇట్టివాఁడు పుట్ట లేదు, పుట్టఁబోఁడుకూడ” ననుతలఁపుల మనలో నుదయింపఁ జేయును.

సర్వస్వతంత్ర భావనాశక్తి కుదాహరణములు. 1. షేక్సిపీయరు మహాకవి రచితమగు హామ్లెట్ నాటకము.

ఇట్టి దివ్య దృష్టి సూచకమగు భావనాళ క్తికి వాట్పుడం టను పండితుఁ డొకయుదాహరణము నొసంగినాఁడు అయ్యది షేక్సు పియర్ (Shakespeare)అను నాంగ్లేయకవి శేఖరునిచే రచిం పఁబడిన(Hamlet) హామ్లెట్ అను నాటకమునుండి కై కొనఁబడి