పుట:2015.372978.Andhra-Kavithva.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము

రసాత్మకం వాక్యం కావ్యమ్.

7


గను, నతీతరసవంతముగ శ్రీపాద్యుమును రచించువారు. పుట్టక పోరని మాయభిప్రాయము కాదు. అట్లయ్యు నింతవఱకు 'అదోషౌ సగుణె సాలంకారౌ శబ్దార్త్ కావ్యా ' మ్మనులక్షణ మునకు సరిగఁ గావ్యమును నసిధారావ్రతముగ సమర్థించిన కవియే జనింప లేదని నుడువుట సాహసోక్తిగాని, యసత్యో క్తిగాని కాదని విన్న వించుచున్నాఁడను. ఎన్నటికైన నట్టి మహా మహుఁడు జనించు నేమో చెప్పఁజాలను. ఒక వేళ నుద్భవించి నను నుద్భవింపవచ్చును. మహామహులు సర్వశిక్షముల లోకోద్ధరణమున కై జనింపవచ్చును. కాని, అట్టివారు విమర్శనా తీతులగుట చేఁ బ్రకృతము మనవాదములోనికి రారు.

,

రసికమతము

ఇఁక రెండవమతమును విచారింతము. ఈమతమునకు మూలసూత్రము 'రసాత్మకం వాక్యం కావ్యమ్' అను విశ్వ నాథుని నిర్వచనమే. ఈమతము ప్రకారము కావ్యమునకు రసమే జీవము, స్త్రీకి సౌందర్యమును, బ్రణయమునకు భావ మును నెట్లో కవిత్వమునకు రసమును నట్లే.

రసస్వరూపరహస్యము

రసమన నేమి? అదీ కవిత్వమునకు నెట్లు ప్రాణమగును? ఈ ప్రశ్నలకు సమాధాన మొసఁగుట మిక్కిలియుఁ గష్టము. ఏలనన: శరీరమునఁ బ్రాణమె ట్లదృశ్యమయ్యును నిండి నిబిడీ కృతమై సర్వావయవముల వ్యాపించియుండునో అట్లే రస మనునది కావ్యమున నిచ్చోట నున్న దనికాని లేక యచ్చోట నున్న దనికాని చెప్పుటకు వీలుగాక కావ్యమున నాదినుండి తుదివఱకును నేక ధారగఁ బ్రవహించుచు నేయుండును. సాధా