పుట:2015.372978.Andhra-Kavithva.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

ఆంధ్ర కవిత్వచరిత్రము

ప్రథమ


రణముగఁ జక్కనియువతిని జూచినప్పుడామెయందము ముక్కున సున్నదా? లేక కన్ను లయం దున్న దా! లేక చెవులయం దున్న దా? యనుపృచ్చ కవకాశము లేకుండ నెక్కడఁజూచినను జక్కఁదనము మిట్టిపడుచునే యున్నప్పుడే యాస్త్రీ లోకైక సుందరి యనియందుము. ఒక్కొక్కప్పుడు ఏయవయవమునను సంతసొందర్యము లేకపోయినసు గొన్ని యవయవములఁ గించిల్లోపము లున్నను మొత్తముమీద వాలకమంతయు నేదో యనిర్వాచ్యమగు సౌందర్యముతో నొప్పుచునే యుండును. సాధారణముగఁ బ్రపంచమున "నల్లఁ గానున్న ను చిలుక పంటిపిల్ల చామనచాయ యన్న మాటే. కాని యాపిల్ల కేమమ్మా? చక్కనిచుక్క గావటమ్మా?' అనుచు నమ్మలక్క లాఁడుపలుకులు సూక్ష్మమయిన యీరసరహస్యకహస్యమును సూచించు చున్నవి -

లోపరాహిత్యము రసవిషయమున నరుదు.

ఈ రసరహస్యముప్రకారము చామనచాయగల స్త్రీ యెట్లు వాలకమునసు, నోయారమునను సతి సౌందర్యవతిగా గనుపించునో యట్లే కావ్యమున నెచ్చట నేని శాస్త్ర సమ్మతము కౌనివియు, లోపమనఁదగినదియు నగు విరుద్దలక్షణ మేమయిన నుండినను గావ్యము మొత్తముమీఁద రసజీవిగ సున్నఁ జూలును, ఈవాదమున ముఖ్య విషయము లేవనఁగ: ప్రపంచ మునఁ బరిపూర్ణ సౌందర్యమే వస్తుపునం దేనియు మృగ్యము కావునను, ఒకపరమేశ్వరునియందుఁ దప్ప సకలచరాచర ప్రపంచమునందున నే కొద్దిలోపమేని యుండకమానదు. కాపునను,ప్రపంచవిషయమునను, మానవకృత్యముల విషయముననుఁగించి