పుట:2015.372978.Andhra-Kavithva.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర కవిత్వచరిత్రము

ప్రథమ

6



రముగాఁ గొని ప్రపంచమున రాధాకృష్ణుల ప్రేమమును, దారా శశాంకుల ప్రణయమును, బిత్రాంగిసారంగధరులచరిత్రమును రసవంతములు గావని నిరసింతమా! నిరసిపము. ఏలనన, ఈ పయిన నుదహరింపఁబడిన ప్రణయవ్యాపారముల శాస్త్రాదేశ మున కతీతమును, హృదయసమర్పణజనితమును, నవాచ్యమును నగు ప్రేమము గలదు. అట్టి ప్రేమమునే గాయకులును, గవీశ్వరు లును మనోహరముగఁ గానము చేసియున్నారు. నిసర్గముగ నీ ప్రేమము రసవంతమే కానిచోఁ గవులును గాయకులును నెట్లు మనోహరగానము సేయంగలిగిరి? రాతినుండి తై లమును నెట్టిదిట్టయైనం దీయంగలఁ డా? కావున శాస్త్రా దేశ మే మైనది? శాస్త్ర దేశము అంత్యనిర్ణయము గాజాలదని యొప్పుకొనక తప్పదు. -

శాస్త్రాదేశము మహామహుల బంధింపఁజూలడు.

శాస్త్ర మెప్పుడును సామాన్యమానవులకొరకే యుద్దే శింపఁబడినది. సామాన్యజనాతీత ప్రతిభాశాలురగు మహామహు లను సామాన్య జనోపయుక్తములగు శాస్త్రాదేశములు బంధింపం జాలవు. అట్టి మహామహులకు కొస్తాతీతములగు విశిష్టధర్మము లే వర్తించును. అందువలన శాస్త్రాదేశములే యాధారములుగఁ గొని గుణదోషముల నిర్ణయింపనెంచు మల్లినాథాదులపక్షము వారి కవిత్వలక్షణ నిర్వచనము సర్వకావ్యములకు వర్తింపక, సర్వకవి శ్రేష్ఠులయంగీ కారముఁ బడయక లక్షణాణానుసారులగు వారికే వర్తించును. అందుచే లాక్షణికమతము కవిత్వలక్షణ మునకు సంపూర్ణ నిర్వచనము గాఁజాలదు. అట్లని చెప్పుటలో సర్వశాస్త్ర సమ్మతముగను, సర్వలక్షణలక్ష్మితముగను నదోషము