పుట:2015.372978.Andhra-Kavithva.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము

రసాత్మకం వాక్యం కావ్యమ్

5


నొప్పుకొనక తప్పదు. కాని, 'ఆదోషా, సగుణె, సాలం కారౌ, శబ్దార్జ్ "కావ్య' మ్మను మల్లి నాథునిమతము నంగీకరించుటకు గొప్పచిక్కు తటస్థమగుచున్నది. మల్లి నాథుఁడు మహావిద్వాం సుఁడును సుప్రసిద్ధవ్యాఖ్యాతయుఁ గానఁ గావ్య వ్యాఖ్యానము “లకు సంబంధించిన మరియాదలను సూచించెనేగానీ, కావ్య సృష్టిని నిరోధింపఁగల నియమముల నేర్పఱుపం దలఁప లేదు. వ్యాఖ్యా తల విమర్శనము లన్నియు నిట్టిఫలితమునే యర్థించుచున్నవి. 'అంతియే కాని యవి కావ్య లక్షణముగ నంగీకరింపఁ దగియుండ లేదు. కారణ మేమన, నెయ్యది దోషమో! యేది దోసము గాదో, యేది గుణమో? యెయ్యది గుణముగాదో నిర్ణయించు టకు శాస్త్రము లే యాధారములు గావలసివచ్చును. అందుచే గావ్యమునకు నిరంతర పారతంత్ర్యాంవస్థ వాటిల్లినది. -

లాక్షణికమతమున కా క్షేపణము:"{శాస్త్రా దేశము రస ప్రవృత్తిని బంధింపఁజాలదు. }

అదీయునుంగాక శాస్త్రాదేశ మెంతవఱకు గ్రహింపు దగినదో నిర్ణయించుట కష్టతరము. శాస్త్రా దేశ మంత్య నిర్ణయ మని యెప్పుకొసువారికిఁ దక్క శాస్త్రా దేశము నధి క్షేపించు వారలకు నీమతము రుచింపనేరదు. శాస్త్రా దేశము నధి క్షే.పించు వార లనఁగా నొడలు దెలియక యున్మత్తులభంగి హద్దుమీరి దుష్పథములఁ జరించువారని యెంచక ప్రతిభాశాలు లై నిజముగ సమ్మకము లేమిం జేపీ శాస్త్రముల శిరసావహింపని మహా మహు లనియే భావింతము. ఇందుల కుదాహరణము. శాస్త్ర మునఁ బరదారగమనము పురుషునకును, బరపురుషునకును సంయోగము స్త్రీకిని నిషేధింపంబడినవి. అందుచే నీశాస్త్రాదేశమునే యాధా