పుట:2015.372978.Andhra-Kavithva.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

220

ఆంధ్ర కవిత్వచరిత్రము

పంచమ


లేమియే. కావున భావనాశ క్తి విషయమును సంగ్రహముగను క్షప్తముగను భావప్రకటనమునకవసరము,నుచితమును నగునట్లు గను వర్ణించి, విషయమును బ్రత్యక్షముగఁ గన్ను లయెదుట సాతూత్కరింపఁ జేయఁగలుగును. ఊహాశక్తి యట్లుగాక విష యముయొక్క గుణభేదములను విశేషములను సూహాబలము నను జాండిత్య బలమునను వర్ణించి విషయమును బ్రత్యక్షముగ సాటూత్కరింపఁ జేయఁజాలదు. అట్టిశ క్తిగలవా రెంతవఱకును జాబితాలఁ దయారు చేయఁగల్గినవా రేకాని ప్రాణవంతములగు మూర్తులను బ్రత్యక్షముగఁ బ్రదర్శింపఁజూలరు. మూర్తిని 'తా దర్శించిన కవియే దానిని ప్రదర్శింపఁగలఁడుగాని యూరక యాముదపు దీపముల వెలుంగున వాయుసంచారము లేని చీఁకటి కోణములఁ బూర్వకవికృత కావ్యముల వ్యాఖ్యానసాహాయ్య ముతో గ్రుడ్డిపాఠము గావించు పండితం మన్యులు బ్రదర్శింపం గల రే! ప్రాణ ప్రతిష్ఠఁ జేయుటకు వైద్యునకును, జీవతత్వము బాగుగ నెఱింగిన జీవశాస్త్రజ్ఞునకును సాధ్యమగు నే? ప్రాణము నకు వీర్య మాధారమనియు, వీర్యమునకు రక్త మాధారమ నియు సిద్ధాంతముఁ గావింపంగల వైద్యులును, జీవశాస్త్రజ్ఞులును ఆరక్తమును వీర్యముఁ గావించి, యావీర్యముతో నొక ప్రాణిని సృష్టింపగలరా? అట్టి ప్రాణప్రతిష్ఠ శాస్త్రాతీతము, మనుష్యాతీతము. అది భగవంతునికే సాధ్యము, అట్లే శావ్య మునఁగూడ విషయమునకు మూర్తిని, బ్రాణమును నొసంగుటకుఁ గావ్వలక్షణములను గవిసమయములను బూర్వకవి విరచితకావ్యములను బాగుగఁబాఠముఁగావించిన పండితులకు సాధ్య మగునే ప్రచండభావావేశమునకు లోనయి భానుకరతప్త శరీరునిభంగిఁ దపించుచు నార్తి చేఁ గావ్యరచనకుఁ గడంగి తాను