పుట:2015.372978.Andhra-Kavithva.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

భావములు భావనాశక్తి.

221


వర్ణింపందలంచిన మూర్తిని గన్నులఁ గాంచి వర్ణిం చెడు కవి బ్రహకే చెల్లుంగాని యన్యులకుం జెల్లునే! అందులకనియే.. “కవిబ్రహా కవిర్విష్ణుః కవిర్దేవో మహేశ్వరః కవి స్సొక్షాత్ పరం బ్రహ తస్మై శ్రీకవయే నమః " యని కవిస్తోత్రముఁ గావించుట. ఆ జన్మనా జాయతే కవి.

“జన్మనా జాయతే కవిః

యనుమాట సత్యము, “జన్మనా జాయతే శూద్రః కర్మణా జయతే ద్విజః” యసున్యాయము ననుసరించి మనవారు అనఁగా లాకుణికులు కర్మణాకర్ష చేత: అనగాఁ గావ్యపఠనము చేతను,లక్షణ గ్రంథపఠనము చేతను సత్కవి యగునని భ్రమించుచున్నారు. జన్మతో శూద్రుఁ డై కర్మాచరణము వలన బ్రాహణుఁ డగుననీ చెప్పిన యార్యవచనము కావ్య విషయమునఁ దల క్రిం దవు చున్నది. కవి పుట్టుకతోడనే కవియై పుట్టును. పుట్టుకతోడనే కవి సహజమగు భావనా శక్తితోఁ బుట్టును. ఎట్లలన: సింహము పుట్టుకతోడనే తనజాతి స్వభామును లక్షణమును నగు మత్తేభహనన కాంతఁ గలిగి యుండిన ట్లే నాగుఁబాము పుట్టుకతోడనే తోఁకఁ ద్రొక్కిన వెంటనే పడగవిప్పి బుస్సుమని కఱవ నుద్యమించునట్లే, అగ్ని రవులు కొనుతోడనే సర్వవస్తువులను దహించి భస్మముఁ జేయఁగల్గునట్లే, కావునఁ గవి సామాన్యమానవుఁ డనియుఁ గావ్యరచన ధీశక్తి ప్రదర్శకమనియుఁ జమత్కారజనకమనీయు భావించువారికి గావ్యస్వరూపమును గవి ప్రభావమును దెలీయషని చెప్పసాహ సించుచున్నాము. అట్టి సాహసమునకుఁ బండిత శ్రేష్ఠులు గినియక .