పుట:2015.372978.Andhra-Kavithva.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

210

ఆంధ్ర కవిత్వచరిత్రము

. పంచమ


భావనాశ క్తియొక్క- స్వభావము,

ప్రస్తుతము భవనాశ క్తి యొక్క స్వభావమును నది గావించు కృత్యములును వివరింపఁబడును. భావనాశక్తి మనుజునీయొక్క భావములపై నాధారపడియున్నదని యివీవటికే తెలుపంబడియెను. భావములయొక్క విజృంభణయే భావనా శక్తి యగును, భావములు లేనట్టియు, జడుఁ డగునట్టియు, మృగప్రాయుఁడగు మనుష్యుఁడు భావనాశక్తి గలిగియుం డఁడు. భావములయొక్క ప్రకృతిని విజృంభణమును నడ్డగించి నిర్వికారు లై సమాధియం దుండు యోగీశ్వరులకు భావనాశక్తి తక్కువగ నుండును గాక. సాధారణముగ శరీర వ్యాపారము లకు లోనగుచు రాగ ద్వేషాదుల ననుభవించు ప్రతిమానవు నకును గొంచెముగనో గొప్పగనో భావనాశక్తి యుండును. అట్టి భావనాబలమే యాతని జీవితమును నడపించుచుండును. ఇంతవఱకుఁ దేలిన దేమనఁగా? భావనాశ క్తి భావముల నాధారముగఁ జేసికొని యుండుటచే మానవుని చిత్తవృత్తి ననుస రించునదియే. భావన యెప్పుడును మనస్థితినిబట్టియే వృద్ధి నొందుచుండును. సుఖముగ నున్న వాని భావన యెంతయు సౌఖ్యమును, సంతోషమును బ్రదర్శించుచుండును. విచార మున మునిఁగియున్న వాని భావన యెప్పుడును నిచారసూచక ముగనే యుండును. క్రోధపరవశుఁడై యున్న వాని భావన యెప్పుడును క్రోధరసము నే వెడలఁగ్రక్కుచుండును. ఇట్లే మిగి లిన చిత్తవృత్తులంగూర్చియు నెఱుంగునది.