పుట:2015.372978.Andhra-Kavithva.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

భావములు భావనాశక్తి.

209


ప్రత్యక్షములుగఁ బ్రదర్శింపజాలఁడు, “ఇట్టి దృష్టి బలము దివ్య, ప్రభావమేగాని యన్యము గాదు. అయ్యది భగవద్దత్తమేగాని యన్యమార్గలబ్దము గాదు. భావనాశక్తి గలవారిని చూచి నేరిచికొనుటవలన వచ్చెడుపని కాదు. జన్మతో రావలసిన దే. అందుకనియే "కొయ్యలరీతినో, మహర్షులచందంబుననో నిర్వి కారస్థితి నుండువారు పద్దెములు వ్రాయనేర్తురుగాని కవులగుట యసంభవము. ఏవృత్తాంతమునైనఁ జూచునట్లు వర్ణింపవలయు నన్న దానియొక్క స్థితిగతులను నందలి పొత్రముల సుఖదుఃఖములను రోమరోమమునకుఁ దానే మనఃపూర్వకముగ నను భవించినందప్ప తద్రూపముగ నభినయింప నెవరికిని దరముగా దనియు, భావనాశక్తి సుద్దీపింపఁ జేయునది ప్రకృతి భావ తైక్ష్ణ్యమే యనియు, రెడ్డిగారు వచించుట. ఇట్టి భావతైక్ష్యము కార్యోత్సాహముఁగలిగిన వారియందునను వీరయుగముల జన్మ మునొంది పవిత్ర కార్యసంఘటనోత్సాహముఁ గలిగిన మను జులయం దెక్కువగ నుండుననియు నక్కారణముననే వీర యుగముల నాఁటి కవిత్వము భావనాశక్తి నమితముగఁ బ్రద ర్శించుననియు, దేశ చరిత్రము ననుసరించి జనులలో శౌర్యము హెచ్చుగ నున్నపుడు కవులకు భావనాశక్తి యెక్కువగ సుండు ననియు, శౌర్యము క్షీణించునపుడు భావనాశక్తి క్షీణించి పొండిత్యమును తత్ప్రసాదలబ్దమగు నూహాశక్తియు మెండుగ నుండుననియు రెడ్డిగారు నిరూపించిరి. ఇందెంతయు సత్య మున్న దని యెల్లరు నంగీకరింపక తప్పదు. అది యెట్లో ఆంధ్ర కవిత చరితమును వర్ణించునపుడు సోదాహరణముగఁదెల్పెదను.

ఆంధ్ర కవిత్వ-14 .aa.