పుట:2015.372978.Andhra-Kavithva.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

. భావములు భావనాశక్తి.

211



భావనాశక్తి చిత్తవృత్తుల ననుసరించుచు నియమిత మార్గములనే చరించును.

భావన చిత్తవృత్తి ననుసరించి వృద్దినందునని యంగీక రించినచో వేరొకవిషయమునఁ గూడ నంగీకరింపవలసివచ్చును. అది యెద్ది యన, మానవునకు సాధారణముగ నొక్కొక్క సమయమున నొక్కొక్క భావము ఆవేశించియుండు కతన దద్భావముల కనుగుణములగు వస్తువి శేషములును, వస్తులక్షణ ములును, గోచరించుట సహజము. ఏపనిమీఁదఁ బోవువాఁడు ఆపనికి సంబంధించిన విషయములపైననే దృష్టి యుంచునే కాని, యూరక చోద్యముఁ జూచువానిపగిది, దిరునాళ్ల దర్శింపవచ్చు వాని పగిది నసంగతవిషయములపై దృష్టిఁ బోవనిచ్చునా? అట్లే భావావేశము గలిగినవాఁడు దద్బావానుగుణములగు వస్తువులనే, గుణములనే, విషయముల నే వెదకుకొను చుండును. అన్యవిషయములపై మనసుఁ దగులనీయఁడు, కావుననే భావ దృష్టి యెతయుఁ బరిమిత దృష్టియే, అనఁగా వస్తువు యొక్క సర్వగుణములను సర్వవి శేషములను విచారింపక భావానుగుణ ములగు_అనఁగా భావావేశమునఁ దాత్కా లికముగ మధికి దట్టు విషయములను విశేషములను, గుణములను మాత్రమే గ్రహించుననియు నన్వయించుకొనునది.

భౌవనాదృష్టికిని శాస్త్ర దృష్టికిని గల భేదము.

శాస్త్ర కారుని దృష్టి యట్టిది గాదు. శాస్త్ర కారుఁడు ఏ దేనివిషయమును బరిశీలించుచో ఆవిషయమును సొంగో పొంగముగ విమర్శించి దాని లక్షణముల సన్నియు గ్రహించి సర్వతోముఖ పాండిత్యమును, సంపూర్ణ విజ్ఞానమును వెల్లడింషం