పుట:2015.372978.Andhra-Kavithva.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము

. అనంతో వై రసః,

191


తదనుగుణములగు భావములును కలుగుచు, ననుభూతము లగు చుండును. వయోధర్మముల ననుసరించియే రస ప్రవృత్తియు వర్ధిలుచుండును.

ఆర్యధర్మమునందలి ఆశ్రమపద్ధతుల ప్రయోజనము.

ఈభావమును బురస్కరించుకొనియే మనయార్యధర్మజ్ఞులు మానవజీవితమును నాశ్రమముల క్రింద విభాగముఁ జేసి నారు. అట్టియాశ్రమములు నాలుగు. బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమమును ననునవి. వయాశ్రమమునకుఁదగిన యాహారనియమములు శారీ రకపద్దతులుఁ, గామ్యార్థములు, భావములు మొదలగువానిని మసధర్మజ్ఞులు 'పేర్కొనియున్నారు. వయస్సును మించినబుద్దులును గోరికలును కూడదని ధరజ్ఞులు నిషేధించిన దానిలోని పరమార్థము వయస్సునకును, కామమునకును భావానుభూతి కిని గలసంబంధము సూచించుటయే. బ్రహచర్యాశ్రమము బౌల్యావస్థయే దాని కనుగుణములగు క్రీడాసక్తి విద్యాను రక్తి తెలియని తనము, పసితనపుటానందము, మొదలగుభావ విశేషము లనుభూతము లగుచునే యుండును. గృహస్థాశ్రమ మున నున్న వానికి బాధ్యతలును అనుభ వములును మెండు. భార్య, బిడ్డలు, బందుగులు, స్నేహితులు మొదలగువా రెంద తో యనుదినము మనతోఁ గలసిమెలసి వర్తించుచుందురు. అందుచేఁ దదనుభవానుగుణములగు భావవి శేషము 'లెన్ని యో మానవుని సంచలింపఁ జేయుచుండును. వానప్రస్థాశ్రమమున నున్న మానవునకు సంసారబంధములు వీడుచువీడుచు, భగ వద్భావము కుదురుచుఁ గుదురుచు నుండును. అందు చేయ