పుట:2015.372978.Andhra-Kavithva.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

190

ఆంధ్ర కవిత్వచరిత్రము

చతుర్థ


(తిరిగి శైశవావస్థ సంభవించ, సర్వమును శూన్యముగ నుండి పండ్లు వినా, కన్నులు వినా, రుచి వినా, సర్వము వినా మానవుఁడు జీవితయాత్ర, జాలించును) అని పై పద్యము యొక్క భావము.

శ్రీశంకరాచార్యుల యభిప్రాయము.-

ఈభావమునే శంకరాచార్యులవారు భజగోవింద శ్లోకములలో నిట్లు వర్ణించినారు....

బాలస్తావతీ డాసక్తః తరుణ స్తావత్ తరుణీసక్తః,
వృద్ధస్తావత్ చింతాసక్తః పరే బ్రహణి గోపి న సక్తః.
వయసి గతే కః కౌమవి కారః ఓణే విత్తే కః పరివారః,
శుష్కే నిరే కః కాసారః జ్ఞాతే త త్త్వే కః సంసారః,

పై శ్లోకములభావము వయఃపటుత్వ మున్నంత కాలమును శ్రీడాసక్తి కాంతానురక్తి మొదలగు కామవికారము లుండు ననియే. అట్టివయసు గతించిన చోఁ గామవికార మేడది ? విత్తము క్షీణించిన వానికడఁ బరివారమును, నీరమెండిపోయిన శాకారమును, తత్త్వజ్ఞానము తెలిసినపిదప సంసారమును నెక్క డుండును? కావున కామము వయఃపరిపాకము ననుసరించియు, శరీరపటుత్వము ననుసరించియు వర్ధిల్లుచుండుననియుఁ దేలుచున్నది.

మనోవికారములు శరీస్థితి ననుసరించును.

కావున శరీర మెన్ని వికారములకు లోనగుచుండునో మనస్సుగూడ నన్ని వికారములకు లోనగుచునే యుం డును. ఇట్టివికారము లన్నియు నాయావయోవిశేషములకుఁ జెందుచుండును. ఒక్కొకవయస్సునకుఁ దగిన కామములును, --