పుట:2015.372978.Andhra-Kavithva.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

192

ఆంధ్ర కవిత్వచరిత్రము

చతుర్థ


దదనుగుణములగు సంశయమును, సంచలనమును, ఆశయు, జిజ్ఞాసయు మానవుని సంచలింపఁ జేయుచునే యుండును. తురీయాశ్రమమగు యత్యాశ్రమమున మానవుఁడు సర్వ బంధములఁ ద్రించికొని, రాగవిముక్తుఁడై , శాంతియుతుఁ డై భగవద్భావము చేఁ బ్పూర్తిగ నావహింపఁబడినవాఁడై నిశ్చలుఁ డై ధ్యానతత్పరుఁ డై భగవంతునిలో నైక్యమగుటకు వేచి యుండును. అందుచేఁ దదాశ్రమానుగుణములగు శాంత భావమును చిదానందమును మానవుని పశముఁ జేసికొనును, వీరప్రసాదులగు శంకరాచార్యుల వంటివారు బ్రహచర్యముననే తురీయాశ్రమమగు యత్యాశ్రమమును గ్రహించి జ్ఞాన మయులై బ్రహ్మతో నై క్యము నొందిరి. అట్టివారు వయసును మించిన శక్తిగలుగు మహామహులు. సామాన్యులందఱకును ఆశ్రమపద్దతియుఁ దదనుగుణములగు కామ్యార్ధములును, భావానుభూతియు లభ్యమగుచునే యుండును. కావున నే మనధర్మము సమగ్రమును సర్వభావసము పేతమును సర్వరసోపే తమును నై యున్నది. అట్టిభావములన్నీ యుఁ బూర్తిగ ననుభ వించిన యతనిజీవిత మే సఫలమైనదిగా నెంచఁబడుచున్నది.

మానవుని యభివృద్ధినిగూర్చిన భిన్నాభి . 1 ప్రాయము. ప్రాచ్య దేశ వాసులయభి ప్రాయము.

ఇంత వరకును శైశవమునుండి మానవుఁ డభివృద్ధినొందు చున్నాఁడని సామాన్యజను లెల్లరు నొప్పి కొనఁజెల్లు సిద్ధాంతము గావించితిమి. "కానికొందఱుకవులును, వేదాంతులును మనము అభివృద్ధియని యెం చెడు నది నిజమగు సభివృద్ధి కానేరదనియు, శిశువు భగవదంశ సంభూతుఁడగుటచేఁ బూర్వజన జ్ఞానము కలిగి