పుట:2015.372978.Andhra-Kavithva.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

అనంతో వై రసః

189.


వానికిని, జ్ఞానము కుంటుపడియే యుండుననియు నిర్ధారణ యగుచున్నది. ఇట్టి వయోవృద్ధితో బాటు, మానసికాభివృద్ధితో బాటు , కామము కూడ సభివృద్ధి నొందుచునే యుండును. శైశవమున మాతృవదనదర్శనమును, తల్లిపాలును దక్క సస్యములయెడ శిశువునకుఁ గొంతయును గామమును నుండవు. బాల్యమున నాటవస్తువుల పై నను, నాటపాటలపై నను, చెలిమికాండపై నను, తోబుట్టువులయెడను 'భాలునికిఁ గామ ముండును. ఇట్లే యౌవనమునం క్రీడాసక్తియుఁ గామవికారమును మిక్కుట ముగ నుండును. కౌమారమున భార్య పై నను, బిడ్డలపై నను,, ధనధాన్య భాగ్యభోగములపై నసు విక్కిలియాసక్తి యుం డును. వార్ధక్యమున బిడ్డలయెడను, మనుమలు మనుమరాండ్ర యెడను, బందుగులయెడను, సుఖము నెడను, శాంతి యెడను మమకారము మిక్కుటముగ నుండును. జరయందు భగవద్బ కియుఁ, జిత్తశాంతియు, సుఖమరణముపై నాసక్తియు నెక్కువ యుండును. మరణకాలమున సర్వేంద్రియపటుత్వ మును దప్పుట చేతఁ బునః శైశవావస్థ సంభవించును. - మానవుని సప్తావస్థలనుగూర్చి 'షేక్స్పియరు . కవి యభిపోయము.

ఈభావమునే షేక్స్పియరుమహాకవి"As you like it"అను , నాటకమున “The seven stages of man" (మానవుని సప్తావస్థ లను) వర్ణించుపట్టున వార్ధక్యము నిట్లు వర్ణించియున్నాడు

 ;-----

"Last scene of all
That ends this strange eventful history,
 Is second childishness and were oblivion,
Sane teeth, sans eyes, sabs taste, sans every things