పుట:2015.372978.Andhra-Kavithva.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర కవిత్వచరిత్రము

చతుర్థ

188


మానవుఁ డభివృద్ధినొందుననియు, సాక్షద్వర ప్రసాదియై యభి వృద్ధి గాంచఁడనియు నే.

డార్వినుపండితుని ప్రపంచపరిణామసిద్ధాంతము

ఈసిద్ధాంతము ప్రపంచమంతయు నణువునుండి యుద్ప వించినదనియు, మానవుఁడు అమీబాయను రూపరహితజీవ వస్తువునుండి వివిథాంతరములఁ గడచి వివిధ జన్మముల నెత్తి తుట్ట తుదకు శాఖామృగమనఁదగు చింపంజీ యనుమర్కటమునుండి జన్మించెనని చెప్పు(Darwit) డార్విక్ పండితుని"Evolution theory" అనఁగ ప్రకృత్యభివృద్ధి సిద్ధాంతమును దోహదముఁ జేయు చున్నది. పాశ్చాత్యమానసిక్శస్త్రము ప్రకారము శిశువులకు మాన . సీకాభివృద్ధి తక్కువయనియు, జ్ఞానము కొంచెమైన నుండ దనియు, మాతృవదన దర్శనజ్ఞానముఁ దక్క వేరు ప్రపంచమును 'గూర్చిన .జ్ఞాన ముండదనియు, మృగ ప్రాయుఁ డై చేజిక్కిన దానినెల్ల గ్రహించుచు నుండుననియు, దీనికంతకుఁ గారణము శిశువు యొక్క జ్ఞాననివాసస్థానమగు 'మెదడు అభివృద్ధినొందక లేతఁయైనస్థితియం దుంటయును, అవయవము లభివృద్ధినొంది కృత్యముల నెర వేజ్చుకొనఁగల స్థితిలో లేకపోవుటయునే యనియు, మెదడు గట్టిపడి అవయములు స్వాధీనములై శరీర సంబంధములగు కృత్యముల నెఱవేర్ప సమర్థము లైనంత నే జ్ఞానాభివృద్ధి కలుగుననియు, నట్టిజ్ఞానాభివృద్ధి మానవునిశరీర సౌష్ఠనమును, ఆరోగ్య సంపత్తినీ, వయఃపరిపాకమును ననుసరించి యుండుననియు, రోగపీడితుఁడై మంచముఁ బట్టియుండు వానికినిఁ బంచేంద్రి యవ్యాపొరములు తిన్నఁగా జరగుచుండని