పుట:2015.372978.Andhra-Kavithva.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసము దేని నాశ్రయించికొనును?

181


"నను మాకవీశ్వరుఁడు మాకున్నఁ జాలు' ననుచున్నాఁడా! ఆహా! కవిచేయుపనియుఁ గవిమాహాత్మ్యమును నిప్పటికైన నీకు బోధపడినదా! ఇట్టివానినా నీవు మొదట సంశయించితివి? ఇట్టివానినా దుర్నీతిబోధించువాఁడని చేరి సావాసముఁ జేయ భయంపడి వెనుదీసితివి? కర్తయను పొగచేఁ గన్నులుమూసీ కొనిపోయిన మీకు నానందతేజముఁ జూపించి యానందదృష్టి నిచ్చినవాని నేనా, దుర్నీ తీపరుఁడను నీలాపనిందపాలు చేసితివి? ఇట్టివాని నేకదా మనవారు,

 ఉ. మూఁపున వామకుండలము, మోవి నొకిం చుకమోడ్పు
నందము, జూ పెడునోరచూపు, సొగసుంబొమ, యొక్కట
నిక్కుఁ గన్పడర్, గ్రేపులు సొక్కఁ గల్పకము క్రిందఁద్రిభం
 గిగ నిల్చి యంగుళీ వ్యాపితవంశ పూర్తియయి వర్తిలు
మోహనమూర్తిఁ గొల్చెదన్ .

అని శ్రీకృష్ణ కర్ణామృతమున లీలాశుకయోగీంద్రునిచే వర్ణింపఁ బడిన మురళమోహనుఁడగు శ్రీకృష్ణునిగను;

 శ్లో. లోకా నాహూయ సర్వాణ డమరుకనినదై !
ఘోరసంసారమగ్నా౯
దత్వా భీతిం దయాళుః ప్రణతభయహరం
కుంచితం పొదపద్మమ్;
ఉద్ధృత్యేదం విముక్తే రయన మితి కరా
ద్దర్శయన్ ప్రత్యయార్థం
భిశ్రద్వహ్నిం సభాయాం కలయతి నటనం
య స్ప పొయాన్న టేశః