పుట:2015.372978.Andhra-Kavithva.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

182

ఆంధ్ర కవిత్వచరిత్రము

తృతీయ


అను ధ్యానశ్లోకమున వర్ణింపఁబడిన ప్రళయోత్సపరతుఁడగు శ్రీనటరాజమూ ర్తినిగాను, ఆదర్శపురుషులుగను, అధిష్టాన దేవతలుగాను నిర్ణయించి పూజించిరి? సాక్షాద్దైవమువోలె బూజింపఁదగుకవిని నిష్కారణముగ నీలాపనిందకుఁ బాలునేసి పాపముఁగట్టికొంటివే! కవియంతటి యుపయోగకారి, బాథానివారకుఁడు, మహాత్తుఁడు వేరొకరి ధరిత్రిని గలఁడా? కవి యధరమును బోధించుటకు మాఱుఉత్తమో త్తమధర్మ మును లోగో త్తరసౌందర్యయుతమగు లీల వర్ణించును. అతఁడు పెట్టిన దే యానందభిక్ష, సౌఖ్యభిత. సౌఖ్యమును, నానంద మును లేనిది నీధర్మ మెందులకు? నీయర్దసంపద "లెందులకు? అజాగళ స్తనములుంబోలె నిరర్థకములు కావే! సర్వసంపదలకును ఫలము దాని ననుభవించుటయును సుఖపడుటయును ఆనందమునొందుటయు నేకదా? వెనుకటికి కవి' యేమనినాఁడు?

ముక్తి యెద్దిరా,
రక్తి యెద్ది రా?
పొడుడబ్బుసంచులతోఁ
గూడఁ బెట్టి యనుభవింప
జూడ లేక ప్రాణమైన
వీడెడుదురవస్థయేన?
మనసుగొన్న కన్నియకై
ధనముఁ బ్రాణమైన నిచ్చి
ప్రణయపు నిర్వాణమున
దనివి గొనుటశాక యెద్ది?