పుట:2015.372978.Andhra-Kavithva.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర కవిత్వచరిత్రము

తృతీయ

170


ప్రస్తుతై రోపావాసులు, అందులో నాంగ్లేయులు సాక్షాత్తు కలిపురుషావతారులు. అందుకనియే వారికి ద్రవ్య కాంక్ష మెండు. రసభావము మృగ్యము. ధనసంపాదనమను స్థాయీ భావమును దోహదముఁ జేయు విభావానుభావాదులు పిసిని గొట్టుతనము, దురాశ, యన్యాయవర్తనము, పరధనాపేక్ష, యసత్యము, అసూయ, అప్రమాణము, ఈర్ష్య, యేడుపు గొట్టుతనము, నిర్దయ, మొగమోటమి లేమి మొదలగు దుర్గుణములు. ఇట్టి దుర్గుణముల పరంపర తోడ రసభావమునకుఁ జెలిమి పొసఁగదు. కావున రసము అర్థము నాశ్రయింపదు.

రసము మానవసహజమగు కామము నాశ్రయించును.

ఇక రసము దేని నాశ్రయింప వలెను! కామము నాశ్రయించునా? విచారింతము. రసము, అనఁగ భావానుభూతి, దేనికి సంబంధించినది? మనుజున కుండుసహజములగు గోరి కలవిషయముననే భావానుభూతికిఁ బ్రసక్తి కలుగును. కామ్యార్గము గోరుటలో నొకవిధమగు భావానుభూతి, దానికొఱకుఁ బ్రయత్నించుటలో నొకవిధమగుభావానుభూతి, అది లభ్య మైనప్పు డొకవిధమగు భావానుభూతి, అది చేజాజిపోవునప్పు డొకవిధమగు భావానుభూతి, తిరిగి యది లభ్యమైనప్పుడు మఱి యొకవిధమగు భావానుభూతి, ఇంక నెన్ని యోవిధము లగు భావానుభూతుల మనుజుఁ డనుభవించు చుండును. ఆశ , ఉత్కర్ష, సంతోషము, దుఃఖము, శాంతి, శమము మొదలగు. భాషము లెన్నేని మనుజుఁ డనుభవించుచునే యుండును. జీవిత మంతయుఁ గామ్యార్ధములతో నిండియుండుటచే భావము లెప్పుడును ననుభూతము లగుచునే యుండును. అందుకనియే.