పుట:2015.372978.Andhra-Kavithva.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసము దేని నాశ్రయించికొనును!

171



కొందఱు పాశ్చాత్య శాస్త్రజ్ఞులును “Life is a bundle of experi-- ences" జీవితము (భావానుభవములయొక్క సమూహము) అని చెప్పిన పలుకులయం దెంతయు సత్యము గోచరించుచున్నది.

కామము విశ్వవ్యాపి.-

జీవిత కాలమునఁ గామ్యార్ధములఁ గోరనివాఁడును, తన్మూలముగ వివిధ భావసంచలనమునకు లోనుగానివాఁడును బ్రపంచమున నరుదుగ నుండును. కేవలధనార్జనపరుఁడై సర్వ కామోపభోగముల ధనవ్యయమునకు వెఱుచి త్యజిం చెడు పీ నాశి యైనను ధనరాసులఁ జూచునప్పుడు సంతోషమును బొందక మానఁడు. నిశ్చల చిత్తుఁడై, సర్వసంగముల వర్ణించి, రాగరహితుఁడై యోగనిష్ఠ మెయిఁ దప మొనర్చు యోగీశ్వరుఁడును దివ్య తేజము కనుల యెదుటఁ బ్రత్యక్షమగునప్పుడు ఆనందము నొందక మానఁడు. చిత్తవి భ్రమమునొందిన పిచ్చివాఁడును, త్రాంగి మత్తిల్లి క్రిందఁబడియుండు తెగుఁబోతునుగూడ భావసంచ లనముఁ బొందుదురు గాని యాభావమిట్టిదియని తమలోఁ దామైనను గుర్తింప నేరకుందురు, చిట్టచివరకు శిశువులుఁగూడ మాతృ వదనదర్శనముఁ, గావించునప్పుడును, బరిచితులమోము లగుడు నప్పుడును నొకవిధమగు భావము ననుభవించుచునే యుందురు. కాని వారికిఁ గామ్యార్ధమును గూర్చినజ్ఞానము లేకుండుటచే భావానుభూతినిఁగూర్చిన స్వజ్ఞానమును లేకుండును. కామ్యార్థ మున్న యప్పుడెల్ల భావానుభూతి యగుచునే యుండును. కావున గామ్యమునకును భావానుభూతికిని యవి నాభావసంబంధ మున్నది. కావుననే భావానుభూతి యనఁదగురసము కామము నాశ్రయించుకొనునని చెప్ప సాహసించుచున్నాము! కామము