పుట:2015.372978.Andhra-Kavithva.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

172

ఆంధ్ర కవిత్వచరిత్రము

తృతీయ


లేనివాఁ డెట్లు జగమున నరుదుగ నుండునో అట్లే భావసంచలనముఁ బొందనివాఁడును జగమున నుండుట యరుదు. అందుచే భావానుభూతి, అనఁగా రసము సర్వవ్యాపి యని తేలుచున్నది. రసమునకుఁ దావు లేనిచో ట్లుండవు. పపీలికాది బ్రహపర్యం తము రసభావము వర్తిలుచునే యుండును. ఎట్లనఁ గ్రిమికీటక ములలో సైతము భావానుభూతి విదిత మగుచున్నది. ఎవరైన గాని యేదియైన కాని యడ్డువచ్చినపుడు భయపడి పారి పోవుట నిజ ప్రాణపోషణమునకై యోరిమితోడను శ్రద్ధ తోడను బాటుపడుట సంతానరతుణమునకై ప్రాణములపైత మర్పించుటకు సిద్ధముగ నుండుట మొదలగు భావములయను భూతి చీమదోమ మొదలు సర్వజంతుకోటియందునను సువ్యక్త ములు. 'కావున భావానుభూతి లేని జంతువుసైత ముండదు.

ప్రకృతిశూడ భావసంచలనము నొందును జగదీశ ఛంద్ర పసువుగారి నూతన సిద్ధాంతము.

అంతయేల? ప్రస్తుతము భారతీయ ప్రకృతిశాస్త్రజ్ఞులలో నెల్ల నగ్రగణ్యుడగు జగదీశచంద్రవసువు గారు ఇన్ని వేలసంవ త్సరములనుండియు మానవునిచే నచేతనములనియుఁ బ్రాణ శూన్యములనియు నెంచఁబడినవృక్షములు, తాలు, లోహ ములు, మొదలగు వానియందునను గూడ సంచలనమును భావానుభూతియు వివితము లేయని సప్రమాణముగ దిక్ప్రదర్శితముఁ గావించిరి. భగనదాత్త వినా ప్రపంచమున వేఱువస్తువు లేదని చెప్పిన యుపనిషద్వేదాంత సిద్ధాంత పరిణామము ప్రకృతి శాస్త్రమున శ్రీ జగదీశచంద్రవసువు గారినూతన సిద్ధాంతమునందు వ్యక్తమగుచున్నది, సర్వ ప్రపంచమునకుఁ గర్త యొక్కఁడే