పుట:2015.372978.Andhra-Kavithva.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర కవిత్వచరిత్రము

తృతీయ

168


త్ర్య మునే పాశ్చాత్య శాస్త్రజ్ఞులు "Freedom of the will" అని తెల్పియున్నారు. అట్టిచో, రసమును, రసొనుభూతియు, కవిత్వా నందానుభవమును, గావ్యమున వర్ణితములగు భావములును, శాస్త్ర బద్దములును, శాస్త్ర బాధితములును గా నేరవు, శాస్త్రము నకును రసానుభూతికిని తదాత్మకమగు కవిత్వమునకును జాల దూరము సవతీపోరాటము. శాస్త్రము దేనిని గూడదనునో కవిత్వము దానినిసై తము స్వీకరించుచు మనోహరముగఁ జిత్రించును. శాస్త్రము దేని నవశ్యానుషేయమని నిర్ణయించునో కవిత్వము దానిని శుద్ద కోతి యవ్యాపారమని త్రోసి వేయును. ఉదాహరణము. శాస్త్రమునఁ గుల కాంతకుఁ బరపురుషునిసం గతి మహాపాతకమనియు, ఘోరనర కాపాదకమనియు నాదే శింపఁబడినది. కానీ, రాజరాజన రేంద్రుని భార్యగానుండి సవతి కుమారుఁడగు సొరంగధరునివలచి యతనికొరకైప్రాణముల సైతముఁ ద్వజించిన చిత్రాంగియు, గొల్లనిభార్య యయ్యు శ్రీకృష్ణునకు " హృదయసమర్పణముఁ గావించిన రాధయు, సాహితీ ప్రపంచవాసులలో ధన్యులు, మృతజీవులు, సాహితీ ప్రపంచవాసుల కుండవలసిన లక్షణములును, గుణములును, ప్రతిభలును వేఱుగ నుండును. అవి గతానుగతికులును శాస్త్ర నియమశృంఖలా బద్దులును నగుసామాన్యమానవులయెడఁ గన్నట్టవు; వారి కూహాతీతము లయియుండును. కవిత్వ మెప్పుడును శాస్త్రమువలె దేశ కాలపాత్ర ములనే యాధారముగఁ గొని వానినే యనుసరించుచు నుండదు. మీఁదుమిక్కిలి కవిత్వము దేశ కాలపాత్రముల కతీత మై స్వచ్ఛందసంచారము గావించు చుండును. శాస్త్ర దృష్టి యెన్న టికి హ్రస్వదృష్టియే. రససృష్టయుఁ గవిత్వదృష్టియు దీర్ఘము' లై యుండును, శావ్యదృష్టి యతీత