పుట:2015.372978.Andhra-Kavithva.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసము దేని నాశ్రయించికొనును.

159


లేకున్న సంపద లెల్ల నిష్ప్రయోజనము లగును. ఈభావము నింకను విరళముగ విప్పి చెప్పెదను.

ధర్మ మనఁగా మానవుఁడు నిర్వర్తింపపలసినవిధులను నిర్ణయించెఁడు 'శాస్త్రజాలమే. అర్థముకూడ నొకశాస్త్ర మే! ఎట్లన, నర్ణమైనను కొన్ని విధుల ననుష్ఠింపనిది లభ్యము కాదు. అర్థమును "దుర్వృత్తివలన సంపాదింపక న్యాయమార్గమున సంపాదించి న్యాయమార్గమున వ్యయము గావించుచు" సంరక్షించుకోనవలె ననుటయే యర్థశాస్త్రముయొక్క యా దేశము. 'అంతియ కాక యర్థశాస్త్రము 'సంఘము యొక్క యార్థికసంపదయె యొభివృద్ధిఁ జెందునో సంఘము తద్విషయమున ననుష్ఠింప పలసినవిధు లెవ్వియో కూడ నిర్ణయించును. కావున శాస్త్ర జాల మొకవంక మానవుఁ డొనరింపవలసిన విధులను నిర్ణయించును. వేరొరవంక “కామము” మానవునికి సహజముగనుండు గోరికల స్వభావము, వానియొక్క తారతమ్యములను, మంచి చెడ్డ లను వ్యక్తీకరించి యుత్తమజీవితపథమును జూపించును. అట్లే మానవుడు సర్వకామితార్థముల ననుభవించి సర్వకామ్యార్థ ముల స్వభావమునుఁ బూర్తిగ గుర్తెరింగి యనుభవసంపన్నుల డై స్వకీయ భగవదంశమును దెలిసికొని భగవంతునిలోఁ జేరఁ బ్రయత్నించుటకు "మోక్ష” ముపకరించును. మానవుని భౌతిక జీవిత మేయడ్డంకులును లేకఁ తిన్నగ నెఱువేఱవలయుననిన ధరార్థములు రెండును లవసములు, మానవునియాంతరంగిక జీవిత మభివృద్ధి నొందవలయుననినిఁ గామమోక్షము లవసర ములు. ధర్మార్థముల రెండికిని జత కామమోశములకు రెండిఁ టికిని జత "కామి గాక మోక్ష కామి గౌఁడు.” అను ప్రసిద్దా ర్యో క్తియొక్క పరమార్గ మిదియే కదా? - -