పుట:2015.372978.Andhra-Kavithva.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

158

ఆంధ్ర కవిత్వచరిత్రము

తృతీయ


సమగ్ర మానవధర్మపరమోద్దేశమును, ముఖ్యక ర్తవ్యమును, బ్రధానలక్షణమును.

ఆర్యధర్మము ధరార్థ కామమోక్షయుతము.

ఇట్టి సమగ్ర మానవధర్మమును మనశాస్త్రజ్ఞులు ధర్మాత్మ కామమోక్ష యుతముగ నిర్వచించినారు. ధర్మము, అర్థము, కామము, మోక్షము సనునాలుగు భాగములుకల మానవ ధర్మము సమగ్రమా? యసమ్మగమా, యని విచారించుట యప్రస్తుతము గాదు. ధర్మము మానవుఁడనుష్టింపవలసినవిధులను నిర్ణయించును. అర్థము మానవునకు జీవనమునకుఁ గావలసిన ధన ధాస్యసంపదలు లభించువిధమును దెలుపును.కామ మన్న చో మానవునిమనమున నుండుకోరికలను, కామ్యార్ధములను విశదీకరించును. జ్ఞానము మానవుని నిజభగవవంశమును గుర్తెఱుంగునట్లుఁ చేసి యాతనికి జన్మసాఫల్యముఁ గూర్పఁ బ్రయత్నించును. కావున మానవధర్మమున ముఖ్యాంశములుగ మనవారు విధులను, అర్థసంపదలను, కామ్యవిషయములను, నిష్కామత్వమును జ్ఞానమును గ్రహించిరి.

ఈధర్మార్థ కామమోక్షములు పైన 'నేనువివరించిన వ్యష్టి యొక్క భౌతిక జీవితమును, ఆధ్యాత్మిక జీవితమును, సంఘము యొక్క భౌతిక జీవితమును, ఆధ్యాత్మిక జీవితమును గూడ నభి వృద్ధి నొందించును. ధరార్థములు వ్యష్టియొక్కయు, సుంఘము యొక్కయు భౌతి శాభివృద్ధికిఁ దోడ్పడును. కామమోక్షములు వ్యష్టి యొక్కయు సంఘము యొక్కయు, నాంతరంగిక జీవితము సభివృద్ధిఁ జేయును. ధర్మము లేనిది అర్థసంరక్షణమును, కష్ట కార్యములగును. కామము. మోక్షమును 00