పుట:2015.372978.Andhra-Kavithva.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము,

రసము దేని నాశ్రయించికొనును ?

155,

త్మోపలబ్దినిఁ బడయును. అందుచే బాహ్యసంఘాభివృద్ధి కొంత వఱకు 'మానవుని వికాసమునకుఁ దోడ్పడును. ఎట్లన - విద్వ త్కుటుంబములో జన్షించి యం దే పెరుఁగుబాలుఁడు విద్యా వంతుఁడై పేరు ప్రతిష్ఠల గడించును. మూర్ఖులయింటఁ బుట్టెడు బాలుఁడు తోడివారల దుర్నీతిని, జెడునడతను నేర్చికొని దుష్పథమునఁ జరించి చెడిపోవును, వరప్రసాదులై యీ నియమమును మీజి “తులశమ్మకడుపున దురదగొండి పుట్టుతుంది, దురదగొండికడుపున తులసి. పుట్టుతుంది" యని జను లాడు కొనెడు సామ్యమునకు గుఱియైనవార లుందురుగాక! సాధా రణముగఁ బైనఁ జెప్పఁబడిన సూత్రము నర్తించును. అందు కనియే మనవారు "కులమెరిగి కోతి యైనమే జేసికోనవలె" నని చెప్పుదురు. బొహ్య సంఘ ప్రవృత్తి మానవునిజీవితమున కొక విధమగు నాధారముగను చేయూతగను నుండును. అట్టి. చేయూతఁగొని మానవుఁడు స్వీయజన్మాంతర పంచిత ప్రతిభ చే మహామహుఁ డగును.

కాని సంఘము ప్రవృత్తియే మానవుని జీవితమును. బూర్తిగఁ బోఁతఁబోసినట్టు మార్పుఁ జేయు నని చెప్పుటకు వీలు లేదు. ఏలనన అట్లంటిమేని మహామహులందఱుసు సంఘ ప్రవృత్తివలన నుద్భవించి గొప్పతనము సంపాదించిరని చెప్పవలసి వచ్చును. అట్లు చెప్పిన నసత్యదోషమునకుఁ బాల్పడుదుము. ఎట్లన సంఘము ఆజ్ఞానాంధకారమగ్నము లై యున్న తరి పర ప్రసాదులగు మహామహులు సూర్యచంద్రాదులభాతి నుద యించి జ్ఞానజ్యోతులఁ గొని వచ్చి ప్రపంచము నెల్లను శోభాయ మాసముఁ గావించుచున్నారు. అట్టిమహామహుల వతరింపనిది సంఘ మభివృద్ధినొందక తొల్లింటి ప్రాకృతావస్థలోనే యుండుట