పుట:2015.372978.Andhra-Kavithva.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154

ఆంధ్ర కవిత్వచరిత్రము

తృతీయ

ఈమానవధర్మముయొక్క ముఖ్యోద్దేశమును సూచించితిని. మానవుఁడు తన కుచితమయిన పద్ధతుల జీవితముఁ గడపి సఫలీకృతుఁడు కావలెనని నిశ్చయించి 'ధర్మజ్ఞు లనేకములగు నియమముల నేర్పఱచిరి. ఆనీయమముల వ్యాప్తిని గూర్చియుఁ బ్రయోజనమును గూర్చియుఁ బ్రసంగించెద. జీవితమునందలి వివిధాంశములను, వాని కేవిధమున సామరస్యము కలుగునో యావిధమును, సట్టిసమగ్ర సామరస్యమున రసమునకుఁ గల ప్రాముఖ్యమును గమనింపఁదగిన విషయములు.

మానవజీవితము యొక్క భాగములు. 1.ఆత్మ జీవితము. 2. సాంఘిక జీవితము.


మానవజీవితమున రెండు ముఖ్యములగు భాగములు ఆత్త, జీవితము, సాంఘిక జీవితము నను పేర్లఁ బరఁగుచుండును. ఆత్త జీవితమునకు రెండు విధములుగ నర్థముఁ జెప్పుకొనవచ్చును. ఎట్లన: స్వలాభ మనునొకయర్గమును, ఆత్మకు సంబంధించిన జ్ఞానజీవితమును మానసికజీవితమును నని రెండవ యర్థమును, అట్లే సాంఘిక జీవితమునకును రెండర్థములు వర్తించును:--- ఒకటి: సంఘము యొక్క సమష్టి శ్రేయము, రెండు: సంఘము యొక్క సమష్టి ఆత్త వికాసము, ఆత్మజ్ఞానమును. ఈ రెండిటికిని జూల సంబంధ మున్నది. ఎట్లన:

మానవునకు సంఘమునకుఁ గలసంబంధము,

మానవుఁ డెంత భగవదంశసంభూతుఁ డైనను నిమిత్త మాత్రముగ నైనను శరీరమను నుపాధిఁ దాల్చి తల్లిదండ్రుల కడుపునఁ బుట్టి సంఘములో నొకసభ్యుండై దినదిన ప్రవర్ధ మానతఁ గాంచి జనాంతరసంస్కారవాసనా బలమున స్వీయా