పుట:2015.372978.Andhra-Kavithva.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

156

ఆంధ్ర కవిత్వచరిత్రము

తృతీయ


సంభవించును. కాని సంఘ మట్లు ప్రాకృతావస్థలో నుండక నిరంత రాభివృద్ధిఁ గాంచుచున్న దని యందఱకుఁ దెలిసినవిష యమే. అట్టిసంఘాభివృద్ధికి మహామహుల యద్భుతకృత్యములును, దివ్య చారిత్రములు నే కారణభూతములని యెఱుంగునది. అట్టిమహామహులు జనాంతర సంస్కారవాసనాబలమునఁ దమ యందున్న భగవదంశమును బాగుగ గుఱుతించి యనుభవించి ప్రపంచమునకుఁ బ్రదర్శితముఁ గావించి సంఘము నున్న తస్థితికి దేఁగలిగినారు. అట్టి మహాత్ములు సంఘమువలన గొప్పవా రైరని చెప్పుట యసత్యమగును కానీ అట్టిమహాత్ములు సైతము సంఘ ములో సభ్యులుగ సంచరించుచు నున్నంత కాలము సమష్టిసంఘ శ్రేయము వారికిఁ గూడ నభ్యర్థనీయమగు కామ్యార్థముగ నుండవలెను.

అట్లు గాక మహాత్ములు తమదారిని దామే పోవుచు సంఘ శ్రేయమునకుఁ బతికూలు రగుచో సంఘముతో వారికి సంఘట్టనము కలుగక మానదు. అందుకనియే మన నైతికులు కొన్ని యెడల జనవాక్యం తు కర్తవ్యం” అని బోధించి యున్నారు. పాశ్చాత్య దేశములలోఁ గూడ “Vox Populi Vox Dei" "ప్రజావాక్యమే దైవవాక్యము' అనునొర్యో క్తి కలదు.

ఆర్యధర్మము ఆత్మ జీవితమునకును,- సాంఘిక జీవితమునకును సమన్వయము , గూర్ప యత్నించును.

మానవజీవితముననున్న పై రెండుభాగములకును సరిగ వర్తించును మానవ జీవితముననున్న పై రెండు భాగములకునుసరిగ వర్తించు మానవధర్మమును శాసింప మన ధార్మికులెంతేని