పుట:2015.372978.Andhra-Kavithva.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసము దేని నాశ్రయించికొనును?

157


పాటు వడిరి, మనశాస్త్రజ్ఞులే కాదు, ప్రపంచమున సర్వదేశముల. యందలి ధర్మశాస్త్రజ్ఞులును నిరంతరమును బ్రయత్నము లిందు, కొఱకై సల్పుచునే వచ్చినారు; సల్పుచున్నారు. శాస్త్రమునకు ముఖ్యమగులక్ష్యమేమన, మానవుఁడు సంఘమునకు విరోధి కాకుండ సంఘ శ్రేయమునకుఁ బ్రతికూలుఁడు గాకుండ స్వీయ. భగవదంశమునకుఁ బరిపూర్ణత్వము సిద్ధింపఁ జేసికొనుటయు, స్వీయ క్షేమము సభివృద్ధి ' జేసికొనుటయు నేకాని వేఱుకాదు. ఎన్ని శాస్త్రములు పుట్టినను, ఎన్ని ధర్మములు వెలసినను నీపర" మార్గమును సాధించుకొరకే. ఎన్ని ప్రతిష్టాపనలు గావింపఁబడి" నను నీఫలితము లభించుట కొఱకే. అంతియగాక మన ధార్మికులు ఆత్మ జీవితమునకును సాంఘిక జీవితమునకును నొక్కొకదానికిని ద్వివిధములగునర్గముల నొప్పికొని యున్నారు. 'ఆత్మ జీవితమునకు మానవుని యొక్క బాహ్య జీవితమును, ఆంతరంగిక జీవితమును నను రెండు అర్థముల సంగీకరించి యున్నారు. సాధారణముగ జీవనము జరుగు నుపాయమును, భగవదంశము సంపూర్ణముగా సిద్ధం చెడి యుపొయమునుఁ గూడ మానవునికి నభ్యర్ధనీయములని మన ధార్మికు లా దేశించి యున్నారు. సంఘమునకుఁ గూడ ద్వివిధములగు శ్రేయము లవసరములని మన ధార్మికు లంగీకరించి యుండిరి. అవి యేవనఁగా, సంఘము యొక్క యార్థికాభివృద్ధి. యనఁగ ధనధాన్యాదిసంపదలును, మానసికాభివృద్ధియుఁ దదుప యుక్తములగు జ్ఞానసంపదయును నని మన ధార్మికులు తెల్పిరి. వ్యష్టిపరముగ నవసరమని చెప్పఁబడిన బాహ్య, ఆంతరంగిక జీవితములే సమష్టి సంఘఘుపరముగఁ గూడ నన్వయించును. ఇట్టి వ్యష్టి సమష్టుల రెండింటి శ్రేయమును సంపాదించుటయే,