పుట:2015.372978.Andhra-Kavithva.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138

ఆంధ్రకవిత్వచరిత్రము

ద్వితీయ

________________


యాలాపగోష్ఠియు, గోష్ఠయందున గోష్ఠియందున నోరామ చంద్రా! నీదుకథయే వినంబడుచున్నది.”

        పై శ్లోకములభావమును రసపరముగ నన్వయించి విమర్శింతము. భక్తుఁడొక యరణ్య 

ప్రదేశమునఁ ద్రిమ్మరు చున్నాడు. అట్టియెడ నతనికిఁ బ్రకృతి యెట్లు గోచరించెనో యిందు వర్ణింపఁబడినది. భక్తుఁడు రామపాదారవింద భజనతత్పరుఁడు. అట్టిభక్తునకు ప్రపంచము సర్వమును రామమయముగఁ గన్పడుటలో నాశ్చర్యము లేదు. ఈసత్వమే పై శ్లోకముల వ్యక్తమగుచున్నది. భక్తుడు చనెడు ప్రతిమార్గమునను వృక్ష శాఖలపైన రత్న వేదులు కనఁబడుచున్నవి. ఆరత్న వేదులపై సుఖోపవిష్టములయిన కిన్నరీ సమూహములు గీతములఁ బాడు చున్నవి. అట్టిగీతముల ప్రతిదానియందునను మంజులమగు నాలాపగోష్టి అనఁగా, మృదులమును రహస్యమునునగు సల్లాప గోష్ఠియుఁ దెలియనగుచున్నది. అట్టియాలాప గోష్ఠియందున శ్రీ రామచంద్రుని దివ్య చరిత్రమే వినవచ్చుచున్నది. వృక్షముల, పై నఁ బక్షులు గుమికూడి కూరుచున్నవి. ఆపక్షులు సంతోషముతో రారమ్మనునటులు పాటలు పాడుచున్నవి. ఆపాటలలో రహస్యమగు మృదుసల్లాపగోష్ఠి వినవచ్చుచున్నది. ఆ రహస్య సల్లాపగోష్ఠయందు శ్రీ రామచంద్రమూర్తియొక్క దివ్య, కథయే వినంబడు చున్నది. ఆయరణ్య సీమయందు భక్తుని చెవుల సోఁకెడునది యొక్క శ్రీరాముని దివ్యకథయే కాని వేఱుకాదు. వృక్ష శాఖలును, రత్న వేదులును, కిన్నరీబృంద గీతములును,, మంజులాలాపగోష్టియు, పక్షి సంఘములును, మంజులామోద ! వాక్యములును, మంజులాలాపగోష్ఠులును, శ్రీరామునీదివ్య కథ. వినిపించు సాధనములు మాత్రమే యగునుగాని, స్వతంత్ర,