పుట:2015.372978.Andhra-Kavithva.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసస్వరూపనిరూపణము.

139


వ్యక్తులు కాఁజాలవు. మన భక్తునికి రామనామమే సర్వత, విని పించుచున్నది. తదితరము విన వచ్చుట లేదు. కారణము హృదయము రామనామపూరితమై యుండుటయే, మనము రామ నామామృతపానముచే మత్తిల్లి యుంటయే, కన్నులు రామ మూర్తిని దర్శించి దర్శించి యన్యమును గాంచ లేకుంటయే, వీనులు రామనామగానమునఁ దనిసి యన్యశబ్దముఁ జొర నీకుంటయే.

స్థాయీభావమునకును, రసికునకుఁ గల యద్వైతభావము,

ఆహా, స్థాయీభావమన నిట్టు లేకదా రసికుని హృదయ మును పశము గావించుకొనును! స్థాయీ భావము చే పశుఁడగు రసికునకుఁ బ్రపంచము. సర్వమును శూన్యముగను, రసవిషయమే సర్వమును శాశ్వతముగను గోచరించును. అంతయేల ? అన్య ప్రపంచము గోచరింపనే గోచరించడు.. ఒక వేళ గోచరించెడు వస్తువులైనను స్థాయీ భావమును దోహదము గావించుటకుఁ దోడ్పడు నే కానీ స్వతంత్ర వ్యక్తి గలిగియుండ నేరవు. స్థాయీభావమే సర్వము. స్థాయీభావమే సత్యము, స్థాయీభావమే సాధ్యము. తదితరములు సాధనమాత్రములు. అసంపూర్ణ సత్యములు. రామనామమే సర్వము, రామనామమే సత్యము, రామనామమే శాశ్వతము, రామనామమే సంపూర్ణ జీవిత పరమార్థము, ఇట్లు భావించుభక్తునకుఁ బ్రపంచము సర్వమును శ్రీ రామచరణారవింద ప్రాప్తికి , సాదన మాత్రములుగ గోచరించు నేకానీ స్వతంత్ర వ్యక్తిగలవిగను, పరమార్గములు గను, లక్ష్యములుగను, గోచరించునా? గోచరింపవు. అందు