పుట:2015.372978.Andhra-Kavithva.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140ఆంధ్ర కవిత్వచరిత్రము

ద్వితీయ


కనేకదా మహాభ క్తుఁడును రామపాదారవింద భజనతత్పరుఁడును నగు శ్రీ గోపన్న యను రామదాసుగారు రామపద ధ్యాన లోలుఁడై తత్పారవస్యయమున “అంతా రామమయం జగ మంతా రామమయ"మని గానముఁ జేసెను! ఆహా! రసప్రవృత్తి కన్న నుత్తమమగు జీవితాలంబన మేమి కలదు? అట్టిరసజీవులగు రసీక శేఖరులు పూర్వజన్మ సంస్కారవాసన చే స్థాయీభావము నకు . వశులై యన్య ప్రపంచమును మఱచి రసాధిష్టాన దేవ తలఁ గీర్తించీ కీర్తి కాము లై శాశ్వతజీవమును గడించినారు! అదృష్టమన రసికులదే కదా! జీవితమందంతయు రసాధిష్టాన దేవత కన్ను లయెదుట నిలచి తాండవముఁ జేయుచు జీవితపథము విస్పష్టముగఁ జూపించుచుండ నియమితపథమున జీవితముఁ గడపుచు స్వచ్చందసంచారము గావించు రసిక శ్రేష్ఠులకును, మేఁకలమందవోలె గతాసుగతికులై స్వీయజీవితపరమార్గముల గుర్తెఱుంగ లేక, కూపస్థమండూకములుంబోలెఁ దమ సంకుచిత భావములతోఁ దృప్తినొందుచు, మృత్యుపథమున నిరంతరము బ్రయాణ మొనర్చుచు, కీర్తికాములు గాక పేరు ప్రతిష్ఠలు లేక నశించుచుఁ దమకును, తముగన్న దేశమునకుఁగూడ నపఖ్యాతి నొడగూర్చుసామాన్య మానవులకును నేట్టిసంబంధము? వారికిని వీరికిని హస్తిమశ కాంతరము గదా? వారు ధన్యులు, మృతజీవులు, వీరు హత భాగ్యులు! జీవన్మృతులు ! ! !

2, శ్రీ రాధాకృష్ణుల ప్రణయకథనము.

శ్రీ సీతారాముల ప్రణయకథన మెంత ప్రాముఖ్యము గడించినదో శ్రీ రాధాకృష్ణుల ప్రణయకథనము కూడ సంత ప్రాముఖ్యము గడించినది. శ్రీ సీతారాముల ప్రేమము శాస్త్ర