పుట:2015.372978.Andhra-Kavithva.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసస్వరూపనిరూణము.

137

విషయముగనే గోచరించును. రసవిషయము దక్క నన్యవిష యము లాతని మనము నాకర్షింపంజాలవు. ఏయవస్థయందున్నను నెటఁ దిరుగుచున్నను నేకార్వముఁ గావించుచున్నను రసవిషయమే ప్రధానముగ నతనికి గోచరించుచుండును. ఈభావమునే రామభక్తుఁడగు శంకరాచార్యులు రామకర్ణామృత మున నీ క్రిందిశ్లోకమున వర్ణించెను.

 శ్లో. మార్లే మార్గో శాఖనాం రత్న వేపీ
వేద్యాం వేద్యాం కిన్న రీబృందగీతమ్;
గీతే గీతే మంజులాలాపగోష్టి
గోష్ఠ్యాంగోష్ట్యాం త్వత్క థా రామచంద్ర!

 శ్లో. పృక్షే వృక్షే వీక్షి, తాః పక్షి సంఘాః
సంఘ సం ఘే మంజులా'మోదవాక్యమ్,
వాక్యే వాక్యే మంజులాలాపగోష్ఠ.. '
గోష్ఠ్యాం గోష్ఠ్యాం త్వత్క థా రామచంద్ర!

పై శ్లోకములకర్ణ మీ క్రిం విధమున నుండును.--

"ప్రతివృక్షపంక్తుల మార్గములందును రత్న వేదికలును వేదులందున వేదులందునఁ గిన్నరీసమూహముల గీతములును, గీతమందున గీతమందున మృదువైన యాలాపగోష్ఠియును, గోష్టియందున గోష్టియందున నోరామచంద్రమూర్తీ! నీదు కథయే వినంబడుచున్నది.”

"వృక్షమందున వృక్షమందున పక్షి సంఘములు కనంబడి నవి. సంఘముదున సంఘమందున మంజులమైన శుభాహ్వాన వాక్యమును, వాక్యమందున వాక్యమందున మంజులమైన