పుట:2015.372978.Andhra-Kavithva.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136

ఆంధ్ర కవిత్వచరిత్రము

ద్వితీయ


మున నెల్లెడలను సీత కన్పించునవస్థయే యిందు వర్ణితము. దీని భావము విప్పి చెప్పిన నిట్లుండును.

సీతావియోగా తురుఁడగు రామునకు నేమేడయందుఁ జూచినను సీతయే! ఏదారిని జూచినను సీతయే! ముందునను సీతయే! వెనుకను సీతయే! ప్రక్క ను సీతయే! సర్వదిశలను సీతయే! ఆహా! ఏమి యామనోవైచిత్ర్యము! ఆయనకు నితర ప్రకృతి శూన్య మైతోఁచెను. సీతయే! సీతయే' సీతయే! సీతయే! సకలజగత్తును సీతయే! సీతవినా యాతనికి వేరు ప్రకృతి లేనే లేదు గదా! ఆహా! యేమి యద్వైతభావము! పై శ్లోకమున సీత యందు మనస్సును లగ్నముఁ గావించి యుంటచే రామునకు సర్వప్రపంచమును స్మృతివిదూరమై సీతదక్క నన్యము గోచ రింపదయ్యె. అనఁగా సీతాదేవి సురూపమే యాతనిమనస్సు సావహించి యాతనియందు స్థాయీభావము నొందెను. సీత యన్ననే ప్రపంచము! సీత తోడిదే సౌఖ్యము. సీతయే సర్వ జగత్తునను నేకరీతి వెల్లుచు జీవితపథమును విస్పష్టముగల జూపించు ప్రణయజ్యోతి! అట్టి సీత లేని ప్రపంచము అరణ్యముతో సమాన మని '

"వినా సీతా దేవ్యా కిమివ హి న దుఃఖం రఘుపతేః,

ప్రియానాశే కృత్స్నం కిల జగ దరణ్యం హి భవతి.”

యను శ్లోకమున భవభూతి వర్ణించినదంతయు సత్యముగను హృదయంగమముగను నున్నది.

రస పొరవశ్య స్వభావము,

రసముచే నావహింపంబడి రసము స్థాయీభావము నొందిన కారణమున రసజీవియగు నతనికి సకల ప్రపంచమును రన