పుట:2015.372978.Andhra-Kavithva.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసస్వరూప నిరూపణము.

135


చుండిరట! గాఢపరికంభమువలన జనించిన మందోష్ణసంస్పర్శచే నొడలు మఱచి యిగువురును బ్రపంచము సర్వమును మఱచి రస సిద్ధినొందినవా రయిరి. అట్టివారికి యామములును, నంతయేల? రాత్రి, సయితము గతించిన సంగతి తోఁచు నే? ప్రణయపారవశ్య మును భవభూతి యీశ్లోకమున నెంతయుఁ జక్కఁగ వర్ణించి నాడనుట నిస్సంశయము.

రసము స్థాయీభాపము నొందినప్పు డస్యవిషయములు స్మృతికి రాకుండును. స్థాయీభావముచే నావహింపఁబడిన రస హృదయులకు నిజభావనా ప్రపంచము దక్క సన్య ప్రపంచ ముండదు. సీతారామచంద్రులకును సౌఖ్య సమయమునఁ బ్రపంచము సర్వమును స్మృతిదూరమై అశిథిల పరిరంభ వ్యాపృతై కై కదోషత చేఁ బరవశు లయినవారికిఁ దాము గావించుకొను చున్న సల్లాపములయందలి యాసక్తిబలమున రాత్రి యంతయు గడచిన సంగతి కూడ గోచరింపదయ్యెను గదా! ఆహా! సౌఖ్యాను భూతి యన్న రసానుభూతి యన్న నిట్లే యుండవలయుఁ గదా!

శ్రీ రామునివియోగాపస్థావర్ణనము.

ఇంక సీతా వియోగమునఁ గార్శ్యమునొందియున్న రామునియవస్థ వర్ణించు శ్లోకము నొకదానిని స్మరింతము.

శ్లో. ప్రాసాదే సా, సథిపథి చ సొ, పృష్ఠత స్సొ, పురస్సా,
పర్యంకే సా, దిశి దిశి చ సా, తద్వియోగాతురస్య;
హంహో చేతః! ప్రకృతిరపరా నాస్తి తే కా౽పి సా,సా
సాసొ సాసా జగతి సకలే జయ మద్వైత భావః,

సీతా వియోగముచే మతి చెడి సీతాదర్శనమునే గోరుచు నెల్లప్పుడును దదేక ధ్యానమున నుండు రామునకుఁ బ్రపంచ