పుట:2015.372978.Andhra-Kavithva.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

ఆంధ్ర కవిత్వచరిత్రము

ద్వితీయ

వెలువడెనో ఆ కాలగర్భము నే చొచ్చు చున్నాఁడు. ఈభావము నే మనవారు 'మంటిలోఁ బుట్టి మంటిలోఁ జేరే' నని చెప్పుదురు. మట్టిలోఁ బుట్టి మట్టిలోఁ జేరువఱకు నీజీవి యనుభవించు సుఖ దుఃఖాదిక మనంతము. శైశవమున జీవి లక్ష్మీ సమానమగు మాతృవదనసందర్శనమున నేతృప్తిఁజెంది తజ్జనితానందముననే యోలలాడు చుండును. తల్లీకిని అప్పటికుమారుని యప్పలప్పల యను జిలిబిలి పలుకుల యవ్య కరమణీయవచన ప్రవృత్తులే యింపునింపును. అట్లు శిశువు పెరిగి పెద్దవాఁడై యాటపా టలఁ బొద్దుపుచ్చుచుఁ, బిమ్మట యావనము వచ్చినవాఁడై వయో విలాసమున విజృంభించుచుఁ, దల్లికి సంతసముఁ గూర్చును. పిమ్మటఁ బెద్దవాఁడై సంసారముఁ జేయుచు, నాలుబిడ్డలతో వర్ధిల్లుచుఁ దల్లి దండ్రులకు మనస్సంతోషముఁ గూర్చును. ఇట్లే మానవుని యొక్క వివిథావస్థలును నాత్మ సంబంధము గలి గిన తలిదండ్రులకు సంతోషమును గలిగించుచునే యుండును. మానవుని వివిధావస్థలవలనఁ జైతన్యమునకు సంపూర్ణత్వమును వైవిధ్యమును సిద్దించును. అట్లే ప్రణయమును వివిధా వస్థల వివిథానుభవముల నందినఁగాని సంపూర్ణత్వమునొంద నేరదు. నిష్కల్మషముగఁ బ్రేమిం చెడుమానవునకుఁ బ్రియు రాలిసర్వావస్థలును బ్రేమోద్దీపకములుగనే యుండునుగదా! ఈభావమే కొంచెము విపులముగఁ బర్చింపఁ బ్రయత్నింతుము. ప్రేమకుఁ గారణము జనాంతర సంచితహృదయానుబంధమని మున్నే తెల్పియుంటిని. అట్టి ప్రేమ హఠాత్సంభవముగాని వేరు గాదు. హఠాత్తుగ మెఱుఁగు మెఱసినట్లు మెఱపించి యేఁగిన ప్రియు రాలివదనమును, లావణ్యమును, ఠీవిని, నడకలయందమును బలుమాఱు సంస్మరించుకొనుచు జపతపస్స్వాధ్యాయ