పుట:2015.372978.Andhra-Kavithva.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసస్వరూపనిరూపణము.

131

ములు సేయు యోగి యెట్లు పరమేశ్వరుని దివ్య తేజమును దర్శించి సిద్దిబొందునో యట్లే ప్రియుఁడును ఆపెయందు మనస్సు లగ్నముఁ గావించి తద్ద్యానబలమువలనఁ బ్రపంచమున సర్వమును నామెయందే యుపలక్షించి యామె దక్క నన్య ప్రపంచము లేదని నమ్మి యామెయే సర్వముగ భావించి యా మెయొక్క సర్వసుఖదుఃఖములను దనవిగనే భావించి యామె లేనిది బ్రదుకు దుర్బరమగునవస్థకుఁ బాల్పడి తుదకు నామెకై ప్రాణముల సహతము ధారపోసి యకారణలబ్దమును జనాంతరసంచితహృద యానుబంధ ఫలమును నగు ప్రణయసిద్ధిని బడయఁ జూచును. ఈభావమునే యనేక కావ్యముల నాయికానాయకులవిషయ మున గోచరించును. ఇట్టిభావము నాయికా నాయకులకుఁ బర స్పరమని కూడ గ్రహింపఁదగును. అట్టిపరస్పర ప్రణయాభివృద్ధి వలననే మానవునికి ఫలసిద్ధియుఁ, గావ్యమున రససిద్ధియు లభించును. ప్రకృతము రస స్వరూపు నిరూపణమునకు ననుకూలించు సుదాహరణములమాత్రమే కైకొని విమర్శింతము. ' -

శ్రీ సీతారామచంద్రుల ప్రణయ కధనము. 

అయోధ్యాపురాధీశుఁడగు దశరథ మహారాజు నడిగి విశ్వామిత్ర మహర్షి శ్రీ రామలక్షుణులను గొనిపోయి వారిచేఁ దాటకాసంహారముఁ జేయించి తనయాగమును కొనసాగకుండ నాటంకములు గలిగించు చుండిన రాక్షసులఁ జంపించి నిర్వర్తిత శృత్యుఁ డయ్యెను. పిమ్మట విశ్వామిత్రుడు 'రామలక్ష్మణులను దపోధనుఁడగు జనకునియాస్థానమునకుఁ గొనిపోయి యయోని సంభవయు, నిమిత్తమాత్రముగ జనకునియింట సున్నదియు