పుట:2015.372978.Andhra-Kavithva.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసస్వరూపనీరూపణము.

129

భావోద్దీషక మై యొప్పును. అట్టి నిష్కల్మష ప్రణయమే 'కావ్య మున నవశ్య వర్ణ నీయమని రసహృదయులకు గోచరింపక మానదు.

ఈ రసాభివృద్ధియుఁ బ్రాణికోట్లయభివృద్ధి వోలె ఈ జీవసూత్ర బద్ధమై యుండును.

ఈ రసాభివృద్ధియుఁ బ్రాణికోట్లయభివృద్ధి వోలె ఈ జీవసూత్ర బద్ధమై యుండును. జనాంతర సంచితాత్తానుబంధము వలన జనించిన ప్రేమము. వివిధ రీతుల నభివృద్ధినొండి ఫలసిద్ధి, బడయును. చూడుఁడు.

1. ఉదాహరణములు. ప్రకృతి స్వభావము.

ప్రకృతి స్వభావము ఎట్లు ఈయభిప్రాయమును స్పష్టముఁ జేయుచున్న దో, చెట్టు పుట్టుట తోడనే. చెట్టైపుట్టుట లేదు గదా! విత్తుననుండి చిన్న మొలక యుద్భవించి యది. పెరిగి పెద్దదై శాఖోపశాఖలు గాంచి పూత బూచి, కాయగాచి ఫల, సిద్దిఁ బడసి యితరులకు ఫలదాన మొసఁగ సమర్థమయి. యున్నది. లతలును, బూవులును, గాయలును, సర్వమును నిట్టి, యవస్థాశ్రమమునే యనుభవించి యుద్భవిల్లి సంపూర్ణత్వ మును బొందిన వగుచున్నవి. మొగ్గనుండి పూవును, పూవు నుండి ' పిందెయుఁ, బిందెనుండి కాయయుఁ, గాయనుండి పండును, సంత రాంతరములుగ సభివృద్దిగోచర మగుట లేదా?

2. మానవునివిషయము.

మానవునిసంగతిఁ బరికింతము. మాతృగర్భమునుండి వెలువడి తల్లిపాల చేఁ బోషింపఁబడి వరుసగ శైశవమును, బాల్య మును, యావనమును, గౌమారమును, వార్ధక్యమును, మరణము గూడ, ననుభవించి తాను "మొదట "నేకాలగర్భమునుండి మరుగున