పుట:2015.372978.Andhra-Kavithva.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

ఆంధ్ర కవిత్వచరిత్రము

ద్వితీయ

(ఈకన్యక నిశ్చయముగా క్షత్రియుఁడ నగునా చే బరిగ్రహింపఁబడఁదగినదే. నామనస్సు ఈమె పైదగులుటయే యిందులకుఁ దార్కాణము. బుద్దిమంతులగు సత్పురుషులకు సం దేహాస్పదములగు విషయములయందు నంతఃకరణ ప్రవృత్తు లనఁగా నంత రాత్మ యొక్క యా దేశము లే ప్రధానలక్షణములు. అని పై శ్లోకముయొక్క భావము.)

నిష్కల్మషహృదయు లేదేని వస్తువును బ్రేమించిరేని నయ్యది నిశ్చయముగఁ బ్రేమార్హమై యుండియే తీరవలయును. లేనిచో నట్టివస్తువులందు వారికి మనసు దగులుట యసంభవము. సత్పురుషులకు శుద్దాంతఃకరణముండుఁగాన నట్టి యంతఃకరణ ప్రవృత్తియే వారిసందియములను బాపి చక్కని మార్గముఁ జూపించుననియే పై శ్లోకాభిప్రాయము.

అట్లు ఆశ్రమమును దర్శించి యకారణముగఁ బ్రేమించిన యాశకుంతలా జన్మ వృత్తాంతము చెలికత్తెలవలన వినిదుష్యంతుఁడు మనమున నెంతయు సంతోషమును, శాంతిని నొందిన వాఁడయ్యెను. కానీ యిచ్చటఁ బ్రధానముగా గ్రహించ వలసిన విషయ మంతఃకరణశుద్దియే. అట్టియంతఃకరణశుద్దియే సర్వమును జక్కఁజేయఁ గల్గును. రసవిషయమున నెప్పుడును, సంతఃకరణశుద్ధి యనఁగా మనోనైర్మల్యము ఆవశ్యకము. అర్థముకొరకుఁ గాని, పదవులకోరకుఁగాని, అన్య ప్రయోజనముల కొఱకుఁ గాని వస్తువులను ప్రేమించుపట్ల నీయంతః కరణశుద్ధి లభ్యమగుట యసంభవము. చూచినతోడనే జన్మాం తరసంచితా నుబంధమువలనఁ బ్రేమించు శుద్దమనసుల ప్రణయము నిష్కల్మషమై, స్వచ్ఛమై ప్రకాశమానమై,