పుట:2015.372978.Andhra-Kavithva.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసస్వరూపనీరూపణము,

127


తీక్లముగను జనించునని యిదివరకే తెలిపియుంటిమి. ఆట్లు జనించిన భావము మనవాది వివిధ ప్రసక్తులం దవిలి వివిధావస్థల నొందుననియు నట్టి వివిధావస్థలు విభావానుభావాదులచే సూచితము లగుననియు నిదివరకే సూచించి యుంటిని. సాధారణ ముగా మానవునిభావ మెట్లు జన్మించి వృద్ధినొంది. సిద్దిఁబోందునో సోదాహరణముగా నిరూపింపఁ బ్రయత్నింతును.

జనాంతరసంస్కారమువలన మానవుఁ డేదేని వస్తువును గాంచిన తోడనే జన్మాంతర సంస్థితమగు నాత్మసంబంధము వలన నావస్తువు నెడ మనసు తగిలినవాఁడగును. అట్లు మనస్సు తగులుటకుఁ గారణము మున్ను దెల్పినట్లు అవ్యాజమును, నకారణ జనీతమునునగు నాత్మ సంబంధమకాని వేఱుకాదు. ఇట్టి యాత్మ సంబంధము నే కాళిదాసు శకుంతలా దుష్యంతుల ప్రణయ సుదర్భమున సూచించెను. దుష్యంతుఁడు వేటకై చనీ తపోవసముననున్న శకుంతలను గాంచి యామె వివాహితయో, యవివాహితయో క్షత్రియ కన్యకయో, బ్రాహణ కన్యకయో, యెఱుంగక చూచుటతోడనే యామెయెడ బద్దాను రాగముఁ గలవాఁడయ్యెను. దుష్యంతుఁడు తనమనో వృత్తిని దానే వితర్కించుకొనుచు నీ క్రిందిళ్లోకమునఁ జెప్పిన భావమే మాయభిప్రాయమున స్పష్టపడియున్నది,

 శ్లో. అసంశయం క్షత్రపరిగ్రహక్షమా
యదార్యమస్యామఖిలాషి, మే మనః,
సతాం హి సం దేహప దేషు వస్తువు
ప్రమాణ మంతఃకరణ ప్రవృత్తయః.