పుట:2015.372978.Andhra-Kavithva.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

ఆంధ్ర కవిత్వచరిత్రము

ద్వితీయ

నొకేకావ్యమున వర్ణించుపద్దతి నవలంబింప లేదు. శ్రావ్యము అవస్థావిశేషవర్ణనల నముగ నుండవలయునుగాని యవస్థానము దాయముగ నుండఁదగదు. అనఁగాఁ బాత్రముయొక్క స్వభావమునకును గుణములగు నవస్థావిశేషములను మాత్రమే కవి వర్ణించి పొత్ర సంపోషణముఁ జేయవలయుఁగాని యూరక ప్రస్తుత పాఠశాలల విద్యార్థుల తరగతివారి చదువువలె వర్ణంచుట తగదని మామతము,

లాక్షణికుల చే నుదహరింపఁబడిన అవస్థాక్రమము యొక్క ప్రయోజనము.

లాక్షణికు లాదేశించిన రసావస్ట్రాకమ మవశ్యవర్ణనీయము గాకపోయినను విమర్శకునకుఁ గొన్ని విశేషములను బోధింపఁ గలుగు చున్నది. రస మెప్పుడును సృష్టిస్థితిలయము లను సవస్థాపరిణామ భేదములను నందుచుండుననియే లాక్షణి కుల యాద్దేశమునకు ముఖ్యోద్దేశమయి యుండును. రస మెప్పుడును బెల్లముఁగొట్టిన రాయివ లెం గ్రుక్కుమీక్కుమని యూరకుండక సచేతనులగు మానవులయవస్థావి శేషముల ననుసరించి యవస్థా భేదముల నందుచుండునని మనము ముఖ్యముగ నేర్చుకొనవలసిన విషయము, రస మెప్పుడును నేకస్థాయిని నిల్చి యుండదని యిదిపటికే తెలిపియుంటిని, ఆభావమునే ప్రస్తుత సందర్భమున నీ క్రింది విధముగఁ ద్రిప్పి చెప్పెదము, భావ మెప్పుడును నవస్థాయి భేదము నొందుచుండుననియు నట్టియనభేదము లన్నియు ననుభవించు మానవుని యవస్థాభేదములను, జిత్త వృత్తులను ననుసరించుచు సంపూర్ణమగు. చైతన్యము నొందు ననియు గ్రహింపఁదగు. భావము జనించునపుడు నిశితముగను