పుట:2015.372978.Andhra-Kavithva.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసస్వరూప నిరూపణము.

125..


శాస్త్రజ్ఞులు దెల్పినట్లు జలమునందు ఆక్సిజ, హైడ్రోజన్" అను. రెండువాయువులు కలిసియుండును. వేర్వేరుగ ఆక్సిజ హైడజనులఁ దయారుగావించి మిళితముఁ జేసిన జల ముద్భ వించును. ఇంతవఱకును శాస్త్ర సమ్మతమే, కాని సృష్టికర్తయగు పరమేశ్వఁడు మొట్ట మొదట ఆక్సిజన్ సృజియించి పిదప హైడ్ర జనును సృజించి యా రెంటిని మిళితముఁ జేసి జలమును సృజించెనని చెప్పఁ గలుగు బుద్ధిమంతుఁ డెవ్వఁడు నుండఁడని, మానమ్మకము.

ఈయవస్థాక్రమము యొక్క ప్రయోజనము తక్కువ యని నిరూపించుటకే యింతదీర్ఘ ప్రసంగముఁ గావింపవలసి వచ్చినది ఉత్తమపాత్రముల కెప్పుడును రససిద్ది యతి శీఘ్రముగ లభ్యమగుసు. మధ్యమాధమ ప్రకృతులకు రాయఁగా రాయఁగా రాతీయందు అఱువడిపడునట్లు వివిదావస్థల యనుభవమున నెన్న టిగో యొక సొంటికి రససిద్ధి కలుగు నేమో ! అందుకనే మృకండ మహర్షి యల్పాయుర్దాయుఁడై నను బ్రతిభాశాలియం జ్ఞానసిద్ది సత్వరముగఁ బడయఁగలిగిన సిద్ధుఁడును నగుకుమారునే దయ చేయుమనియు, దీర్ఘాయుష్టంతుఁడయ్యు జ్ఞానసిద్ధిని బడయఁ జాలని యల్పబుద్ధిని దయ చేయవలపదనియుఁ బరమేశ్వరుని వేడుకొనెను. మహాకవులును గావ్య నిర్మాణమున నీసూత్ర, మునే గ్రహించి యవలంబించిరి. రోఁకటిపాటవలె దశావస్థలం గ్రమముఁ తప్పకుండ నొకదానివెంట నొకటిని నొక్కొక్క ప్రకరణమున వడ్డించుచుఁ గావ్యముల ననవసరముగఁ బెంచి సీరస స్థితికి ద్చోడ లేదు. ఒక్క బాణుఁడుమాత్రము దశావస్థలను గ్రమముతప్ప కుండ నేక కావ్యమున వర్ణించియున్నాడు. కాని, కాళిదాసా మహాకవులును దశావస్థలను సొంగోపాంగముగ