పుట:2015.372978.Andhra-Kavithva.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసస్వరూపనీరూపణము.

113

మును నగు లవణమునకు మానవ జీవితమున కెంత యవసరము కలదో అట్లే మానవ జీవితమును రసవంతముగను నానంద మయముగను నొనరించు రసమునకు మానవ జీవితమునందు. గల యావశ్యకము వ్యక్తమగు చున్నది. సముద్ర నాదమును, సముద్ర దర్శనమును నెట్లలౌకిక భావానుభూతిని, అలౌకి కానందమును జనింపఁ జేయునో అట్లే రసస్పర్శనయు రసాను భూతియు నలౌకికానందమును నలౌకిక భావానుభవమును జనింపఁ జేయును. ప్రపంచము నందలి వివిధ దేశములకు సముద్ర, "మెట్లు రాకపోకలఁ గల్పించి సంబంధము గలిగించునో అట్లే రసము, అనఁగ రసభావమే రాజకీయవి ద్వేషములచే విచ్చిన్నమైన మానవజాతి నేకసూత్ర బద్దముఁ గావించి, టెన్నిసన్ అను నాంగ్లేయకవియు, గురుజాడ అప్పారావు గారును నీ క్రింది పద్యముల సూచించినట్లు మానవ జూతీయం దైక్యభావము పెంపొందించి మానవకళ్యాణమునకుఁ దోడ్పడుననుభావము. సూచితమగు చున్నది.

"A commonwealth of Dations and federation of worlds'" జూతులసంఘమును లోకముల సమ్మేళమును” నని పై మాటలు యర్థము .)

  చూడు మునుమును మేటివారల
మాటలనియెడు మంత్ర మహిమను
జాతిబంధములన్న గొలుసులు
జూరీ సంపద లుబ్బెడు. ఎల్లలోకము నొక్కయి బ్లె వర్ణ భేదము వెల్లకల్లె
వేలనెఱుఁగని ప్రేమబంధము వేడుకలు కురియ,

ఆంధ్ర కవిత్వ 8