పుట:2015.372978.Andhra-Kavithva.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

ఆంధ్ర కవిత్వచరిత్రము

ద్వితీయ

సకలచరాచర సృష్టికిఁ బూర్వము జలముమాత్రమే నిండియుం డెను. సకల ప్రపంచమును లయమైన పిదప మహాప్రళయరూపమున జలమే నిండియుండును. సృష్టి యొక్క యాచ్యంతములు - జలములోననే సంభవించు చున్నవి. అట్లే రసము జనించునప్పుడు, సనఁగా విభావాదిగుణవి శేషములతో నొప్పు రసజగత్తు కవిచే సృష్టింపఁబడక పూర్వమును, రసజగత్తు అంతమై లీనమైపోవు నప్పుడును సాయీభావమే మిగిలియుండుననుభావము స్పురించు చున్నది. రసజన ప్రకారమును రససిద్ధి ప్రకారమును సూచితము లగుచున్నవి. అగాధమగు సముద్రమునకు లోఁతెట్లు తెలియదో యట్లే స్థాయీభావముయొక్క లోతును నగాఢత్వమును దెలియఁజాలము, సముద్ర గర్భమున నడఁగియుండు ముత్యములకును, రత్నములకును నెట్లు విలువ నేఱ్పఱింపఁ జాలమో యట్లే స్థాయీభావము వలన జనించు నపూర్వసౌందర్య యుతములగు విభావాదికముల రుచినిగూడ నింతయని నిర్ణయిం పజాలము. భూమిపై నంబలె సముద్రము నందుఁగూడ ననేక ములగు జీవరాసు లెట్లు జీవించునో, యట్లే రసజగత్తు కూడ బాహ్య ప్రపంచమునకు సరిసమానముగఁ దులఁదూగు నట్లుండు ననియు, రసజగత్తునందునను వింత ప్రకృతులును ననేకములగు జీవరాసులును బ్రభవిల్లు చుండుననియు సూచింపఁ బడినది. పంచ భూతాత్మకమగు నీ ప్రపంచమున, ననఁగ పృథివ్యాపస్తేజో వాయు రాకాశయుతమగు నీసృష్టియందు జలరూపమగుసము 'ద్రమున కెంత ప్రాముఖ్యము కలదో యట్లే ధర్మార్థ కామమోక్ష. సంయుతమగు మానవధర్మమున రసమునకుఁ బ్రాముఖ్యము కలదని సూచితమగుచున్నది. "ఉప్పే పస రుచుల కెల్ల” సను లోకపామ్యమునంది సకలరుచుల కెల్లను నాధారమును, నాస్పద