పుట:2015.372978.Andhra-Kavithva.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసస్వరూపనిరూపణము.

111


కర మనఁగా సముద్రముతోఁ బోల్చబడినది. సముద్రమివ గాంభీర్య యని రామాయణమునఁ జెప్పఁబడినట్లు స్థాయి భావము గంభీరమైనది. అంభోనిధి యింకు నంతటి స్థితి యసం భవముకదా? ఆకల్పాంతము నంభోనిధి చిరస్థాయిగ నుండ వలసిన దేకదా! కావున స్థాయీభావముయొక్క స్థిరత్వము సూచితమగుచున్నది. ఎన్ని నదులు వచ్చి కలసినను, నెన్ని నదు లెండిపోయి కలియకపోయినను సముద్రముమాత్ర మచలమై 'యుండునట్లే స్థాయీభావముఁగూడ విభావాదుల పరామర్శ యున్న ను లేక పోయినను గూడ నచలమై యుండునని స్ఫురించుచున్నది. ఎట్టియమృతము వంటి నీరైనను సముద్రములోఁ బడినంతనే యుప్పనగురీతిని నెట్టివిరుద్దములగు వ్యభిచార భావము లైనను స్థాయిభావమునకు వశములై దానిలో లీనములై దానియొక్క స్వరూపము నే పొందును. నిర్వచనము యొక్క యర్థమును విచారింతము, “విరుద్దములును, అవిరుద్ద ములును నగు భాపములచే నిరోధింపఁ బడకను భేదింపఁ బడకను సర్వమును నాత్మ భావపూరితముగ ననఁగా సర్వమును దనయొక్క రూపమునే తాల్చునట్లుగాఁ జేయునదియు, లవణా కరునిఁ బోలినట్టిదియు నగుభావమే స్థాయిభాష మనఁదగును.” నిర్వచనమున స్థాయిభావము యొక్క యచలత్వమును, సర్వ వశీకరణ, సర్వభక్షణశక్తియు విశదీకరింప బడినవి.

లవణాకరోపమయొక్క సార్థకతయు సందర్భశుద్దియు.

లవణాకరోపమానమువలన స్థాయీభావము యొక్క గాంభీర్యమును, నాకల్పాంత స్థాయిత్వమును ధ్వనించు చున్నవి.